Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో మెరుగైన ప్రగతిని కనబర్చింది. గడిచిన నవంబర్ నెలల్లో 62,192 ప్యాసింజర్ వాహనాల విక్రయాలను నమోదు చేసింది. గతేడాది ఇదే మాసం 29,778 యూనిట్ల అమ్మకాలతో పోల్చితే 38 శాతం వృద్థిని సాధించింది. విద్యుత్ వాహన అమ్మకాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ నవంబర్లో 324 శాతం వద్ధితో 1751 యూనిట్ల అమ్మకాలు చేసినట్లు వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో 413 విద్యుత్ వాహన అమ్మకాలు చేసింది. దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఏడాది నవంబర్ నెలలో 62,192 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.