Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జర్మనీకి చెందిన ఇంజినీరింగ్, కన్సల్టింగ్ సర్వీస్ సంస్ధ విరిడిస్ డాట్ ఐక్యు జిఎంబిహెచ్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (ఎస్ఎస్ఇఎల్) తెలిపింది. అత్యున్నత సామర్థ్యం కలిగిన సోలార్ పివి మాడ్యుల్స్ కోసం ఐఆర్ఇడిఎ ఆహ్వానించిన బిడ్స్‌ను విజయవంతంగా సొంతం చేసుకున్న బిడ్డర్లలో ఒకరిగా నిలిచిన జిఎంబిహెచ్తో అవగాహన ఒప్పందం చేసుకోవడం ద్వారా అత్యంత కీలకమైన మైలురాయిని చేరుకున్నట్లయ్యిందని ఎస్ఎస్ఇఎల్ పేర్కొంది.. ఇందులో బాగంగా పాలీసిలికాన్ ఇన్గాట్ వాఫర్ సెల్ మాడ్యుల్ కోసం 4గిగావాట్ల తయారీ కేంద్ర ఏర్పాటులో తమకు విరిడిస్ తోడ్పడనుందని తెలిపింది.