Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గడిచిన నవంబర్ నెలలో రూ.1,31,526 కోట్ల వస్తు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్ల య్యిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో వరుసగా ఐదో మాసంలోనూ జిఎస్టి వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటాయని పేర్కొంది. మొత్తం జిఎస్టి వసూళ్లలో సెంట్రల్ జిఎస్టి కింద రూ.23,978 కోట్లు, రాష్ట్ర జిఎస్టి కింద రూ.31,127 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి కింద రూ.66,815 కోట్లు చొప్పున నమోదయ్యాయి. జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత మొత్తంలో పన్ను ఆదాయం రావడం ఇది రెండోసారని ఆర్థిక శాఖ పేర్కొంది. ఇంతక్రితం తొలి సారి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రికార్డ్ స్థాయిలో రూ.1,39,708 కోట్లు వచ్చాయి.