Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన సర్వీసుల పున ప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వాస్తవానికి డిసెంబర్ 15 నుంచి ఈ సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆంక్షలు కొనసాగించాలని నిర్ణయించింది. డిసెంబరు 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించే ప్రణాళికలను భారత ప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేసిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) బుధవారం ట్విట్టర్లో వెల్లడించింది. ప్రపంచ పరిణామాలు, పరిశ్రమ వర్గాలతో సంప్రదించి అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.