Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎన్బీసీ యూనివర్సల్ కు చెందిన ఆల్ రియాలిటీ టీవీ, ప్రకటన ర హిత సబ్ స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ (ఎస్వీఓడీ) స్ట్రీమింగ్ సర్వీస్ - హే యు- భారత్ లో ప్రా రంభమైంది. మొబైల్, టాబ్లెట్, లాప్ టాప్, కనెక్టెడ్ టీవీలు వంటి వివిధ రకాల ఉపకరణాలపై చూడగల డైరెక్ట్ – టు – కన్జ్యూమర్ (డీటీసీ) అయిన హే యు భారతదేశంలో మొదటిసారిగా ల భ్యం కానుంది.
రియాలిటీ రకం అభిమానులను లక్ష్యంగా చేసుకొన్న హేయు 8,000 ఎపిసోడ్స్ కు పైగా టాప్ రి యాలిటీ కంటెంట్ ను అందించనుంది. కీపింగ్ విత్ ది కర్డాషియన్స్ మొదటి భాగం నుంచి చివరి భాగం దాకా చూడవచ్చు. ఇతర ఫ్రాంచైజీలలో బాగా ప్రజాదరణ పొందిన ది రియల్ హౌస్ వైవ్స్, టాప్ చెఫ్, మిలియన్ డాలర్ లిస్టింగ్, ఫ్యామిలీ కర్మ లాంటివి ఉన్నాయి. హేయు కంటెంట్ అంతా కూడా రియాలిటీ అభిమానులను బాగా అలరించేదిగా ఉంటుంది. విస్తృత మైన ఎంపికలను ఇది అందిస్తుంది. హోమ్ అండ్ డిజైన్, డేటింగ్, కుకింగ్, ఫ్యాషన్, ట్రూ క్రైమ్ వం టి రియాలిటీ ఉపవిభాగాలను అభిమానులు చూడవచ్చు. చందాదారులు స్పాయిలర్స్ గురించి ది గులు పడాల్సిన అవసరం లేదు. అమెరికా షోలలో అనేకం అమెరికాలో అవి ప్రసారం అయిన రో జునే హే యులో ప్రసారమవుతాయి. ఈ సందర్భంగా డైరెక్ట్ టు కన్జ్యూమర్ మేనేజింగ్ డైరెక్టర్ హెండ్రిక్ మెక్ డెర్మాట్ మాట్లాడుతూ, ‘‘భా రతదేశంలో రియాలిటీ టీవీకి పెరుగుతున్న తిరుగులేని ఆదరణ నేపథ్యంలో దేశంలో హే యు ను ఆవిష్కరించడం పట్ల మేమెంతో ఆనందిస్తున్నాం. అత్యుత్తమ కంటెంట్ ను భారతీయ వీక్షకులకు అందించేందుకు మేం ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు. ‘‘హే యు ఇప్పటికే 27 దేశాల్లో తప్ప కుండా చూడాల్సిన రియాలిటీ టీవీ ప్రీమియర్ డెస్టినేషన్ గా ఉంది. ఇప్పుడు అదే తరహా గొప్ప సేవలను భారతదేశంలో అందించనుంది’’ అని అన్నారు. ఎన్నో మార్కెట్లలో హేయు ఇప్పటికే తప్పకుండా చూడాల్సిన, ఆల్ రియాలిటీ టీవీ సర్వీన్ ను అందించడంలో పేరొందింది. రియాలిటీ టీవీ అభిమానులు ఇప్పుడు 3 నెలల ప్రిపెయిడ్ పాస్ ను రూ. 349లకు లేదా 12 నెలల పాస్ ను రూ.999లకు పొందవచ్చు.