Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మొదటి సారి ఆరోగ్య బీమా కవర్ కొనుగోలు చేసే యువ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని, తన తాజా ఆరోగ్య బీమా ప్లాన్ హెల్త్@999ను ఆవిష్కరిస్తున్నామని భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్స్ సంస్థ PhonePe ప్రకటించింది. ఈ తాజా కానుక భారతదేశపు డిజిటల్ పేమెంట్ల రంగంలో మొట్టమొదటిది కావడమే కాక, చౌక ధరకే సమగ్ర ఆరోగ్య కవరేజీ అందిస్తోంది. ఈ ఉత్పత్తిలోని ప్రధాన అంశమేమిటంటే, వినియోగదారు తన పేరు, లింగం, ఇమెయిల్ ఐడి లాంటి వివరాలను అందించే 3 దశల ప్రక్రియను నిర్వహించడం ద్వారా పాలసీని కొనుగోలు చేయవచ్చు. తద్వారా కొత్త, యువ కొనుగోలుదారులను విసిగిస్తున్న సంక్లిష్టమైన ప్రక్రియలను తొలగిస్తోంది. హెల్త్@999 తక్కువ ధరకే, ఇన్-పేషంట్, ICU హాస్పిటలైజేషన్, డేకేర్ పద్ధతులు, ఆంబులెన్స్ ఛార్జీలు, ఆయుష్ చికిత్స సహా అనేక రకాల ఆస్పత్రి ఖర్చులను అది కవర్ చేస్తుంది. దేశ వ్యాప్తంగా సుమారు 7600 ఆస్పత్రులలో ఈ నగదు రహిత హాస్పిటల్ నెట్ వర్క్ విస్తరించి ఉంది. హెల్త్@999 పాలసీని అప్పటికప్పుడే PhonePe ద్వారా అందుకోవచ్చు. అది జీవిత కాల రిన్యూవబిలిటీ ఫీచర్ తో ముందుకు వస్తోంది. హెల్త్@999ను మొదటిసారి బీమా కొనుగోలు చేసే వారి కోసం రూపకల్పన చేశారు. తద్వారా వారికి అధిక నాణ్యత మరియు చౌక ధర ఆరోగ్య బీమాను యాక్సెస్ చేయించుకోగలుగుతారు. ఈ ఆఫరింగ్ నుండి 335+ మిలియన్ PhonePe వినియోగదారులు గొప్ప ప్రయోజనం అందుకుంటారు. దీనిని PhonePe యాప్ లో సులభంగా, తేలికగా అందుకుంటారు. తమ ఆదాయం, విద్యా స్థితి,తో సంబంధం లేకుండా భారతీయులందరూ అత్యున్నత నాణ్యత, చౌక ధర ఆరోగ్య బీమాను కలిగి ఉండాలనే ఆలోచనతోనే ఈ ఆఫరింగ్ కు రూపకల్పన చేయబడింది. మార్కెట్ కు అత్యున్నత బీమా ఉత్పత్తులను తీసుకురావడంలో నైపుణ్యం కలిగిన PhonePe తన వినియోగదారుల జీవితాల్లో అనుకోని సంఘటనల వల్ల తలెత్తే ఆర్థిక రిస్క్ భారాన్ని తగ్గించుకునేందుకు మెరుగైన, తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.”
హెల్త్@999 ప్లాన్ ను అందుకునే విధానం:
PhonePe యాప్ కు లాగిన్ అయి, ఇన్సూరెన్స్ ట్యాబ్ ఎంచుకోండి.
హెల్త్@999 ఐకాన్ పైన క్లిక్ చేయండి.
మీ వయసు వర్గాన్ని ఎంచుకుని, అవసరమైన ఆరోగ్య బీమా కవర్ మొత్తాన్ని ఎంచుకోండి.
పేరు, లింగం, పుట్టిన తేదీ, ఇమెయిల్ లాంటి మీ ప్రాథమిక వివరాలు చేర్చండి..
కొనండి పై క్లిక్ చేసి, మీ పాలసీని వెంటనే అందుకునేందుకు పేమెంట్ చేయండి.
PhonePe పరిచయం:
భారతదేశంలో 335 మిలియన్లకు పైగా రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులతో అగ్రగామి డిజిటల్ పేమెంట్ల వేదికగా PhonePe నిలుస్తోంది. PhonePe ద్వారా, వినియోగదారులు డబ్బును పంపవచ్చు, అందుకోవచ్చు, అలాగే మొబైల్, DTH రీఛార్జ్ చేయవచ్చు, దుకాణాలలో పేమెంట్లు చేయవచ్చు, వినియోగ పేమెంట్లు చేయడంతో పాటు బంగారం, వెండి కొనుగోలు చేయవచ్చు. మరియు వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. 2017లో PhonePe ఆర్థిక సేవలు ప్రారంభించింది, అలాగే బంగారం సేవలను అందిస్తూ వినియోగదారులు 24-క్యారెట్ల బంగారాన్ని సురక్షితంగా కొనుగోలు చేసే అవకాశం కల్పించింది, ఇటీవల వెండి కొనుగోలు చేసే సదుపాయాన్ని కూడా కల్పించింది. అంతేకాకుండా పన్ను-ఆదా ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, COVID-19 మహమ్మారి కోసం ఇన్సూరెన్స్ లాంటి వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఉత్పత్తులను PhonePe ప్రవేశపెట్టింది. అలాగే దేశవ్యాప్తంగా 22 మిలియన్లకు పైగా మర్చంట్ అవుట్లెట్లలో PhonePe అంగీకరించబడుతోంది.