Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో అత్యంత పెద్ద ఆన్లైన్ గమ్యస్థానాల్లో ఒకటైన Purplle.com ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ద్వారా మిలియన్ డాలర్ల పెట్టుబడిని సేకరించింది. ఈ పెట్టుబడి కేదార క్యాపిటల్, సెక్వియా ఇండియా మరియు బ్లూమ్ వెంచర్స్ భాగస్వామ్యంలో పెట్టిన మిలియన్ డాలర్ల అనంతరం వచ్చాయి. ఈ మూలధన పెట్టుబడి భారతదేశం నుంచి మల్టీ-బిలియన్ డాలర్ కంపెనీ ఏర్పాటు చేసే కంపెనీ ప్రగతికి వేగాన్ని నింపనుంది. ఒక ఏడాదిలో కంపెనీ తన బ్రాండ్లను 1000+కు వృద్ధి చేసుకోగా, మేకప్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, పర్సనల్ కేర్, ఫ్రాగ్రెన్స్‌లు మరియు గ్రూమింగ్ అప్లయెన్సెస్లలో 50,000కు పైచిలుకు ఉత్పత్తులను కలిగి ఉంది. కొత్త వినియోగదారులను చేరుకునేందుకు అత్యంత బలమైన దృష్టిసారించిన కంపెనీ తన మార్కెటింగ్ పెట్టుబడులను 2 రెట్లు వృద్ధి చేయడం ద్వారా Purplle బ్రాండ్‌ను నిర్మించింది. కొత్త వినియోగదారుల స్వాధీనాన్ని రెట్టింపు చేసుకున్న Purplle మళ్లీ తిరిగి వచ్చే వినియోగదారుల నుంచి 65-70% ఆదాయం సదృఢమైన రిటెన్షన్ శక్తిని కలిగి ఉంది. పర్పుల్ లాయల్టీ ప్రోగ్రామ్ ఈ ప్లాట్ఫారం ఆదాయానికి 25% మేర ఆఫర్‌ను అందిస్తుంది. ఈ పెట్టుబడి గురించి Purplle.com సహ-వ్యవస్థాపకుడు మరియు సీఈఓ మనీశ్ తనేజా మాట్లాడుతూ, ‘‘మా పెట్టుబడి సేకరణలో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు స్వాగతించేందుకు చాలా సంతోషం కలుగుతుంది. ఈ పెట్టుబడి ద్వారా మహిళల పర్సనలైజ్ చేసిన సౌందర్య అనుభవాలను అందించేందుకు మా విస్తృత శ్రేణి ఆవిష్కరణ ఉత్పత్తులను విస్తరించేందుకు మరియు దేశ వ్యాప్తంగా తన పరిధిని విస్తరించుకునేందుకు సహకరించనుంది. మా ప్రైవేటు బ్రాండ్ల వ్యాపారాన్ని తీవ్రంగా విస్తరించే ప్రణాళికను కలిగి ఉన్నాము మరియు వ్యాపారులకు విభిన్నమైన బ్యూటీ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకు రావడాన్ని కొనసాగిస్తాము. మేము భారతదేశం మరియు అంతర్జాతీయంగా ప్రత్యేకమైన బ్రాండ్ భాగస్వామ్యాలు అలాగే ఫాస్ట్-ట్రాక్ స్వాధీనాలను కొనసాగిస్తాము. ఈ ఏడాది మరింత బలోపేతంగా భారతదేశం నుంచి అత్యంత పెద్ద బ్యూటీ టెక్ కంపెనీల్లో ఒక దాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యాము’’ అని తెలిపారు. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ భారతదేశంలో విస్తరిస్తున్న వినియోగదారులు, ఆర్థిక లావాదేవీలు, సాంకేతితక మరియు ఉత్పాదన వ్యవస్థకు మద్ధతు ఇస్తుంది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ పెట్టుబడుల్లో వినియోగదారులు, ఆర్థిక లావాదేవీలు, సాంకేతితక మరియు ఉత్పాదన ఉండగా, అందులో ఫ్యాబ్ ఇండియా, ఐడి ఫుడ్స్, లెన్స్ కార్ట్, పాలసీ బజార్, ఫ్లిప్‌కార్ట్, ఫస్ట్ క్రై, బెస్ట్ వ్యాల్యూ చెక్ మరియు శుభం హౌసింగ్ తదితరాలు ఉన్నాయి. Purplleలో పెట్టుబడి గురించి ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ భాగస్వామి అతుల్ గుప్త మాట్లాడుతూ, ‘‘మనీశ్, రాహుల్, సుయాశ్ కస్టమర్-ఫస్ట్ విధానంలో సదృఢమైన కార్యనిర్వహణ బృందాన్ని నిర్మించారు. సౌందర్యాన్ని డెమక్రటైజ్ చేయడం భారతదేశంలో ప్రభావవంతమైన విషయంగా కొనసాగనుంది మరియు వినియోగదారులు నేడు వారి చర్మానికి కావలసిన మరియు వ్యక్తిగత ఆరోగ్యం అలాగే వారి సౌందర్యాన్ని వృద్ధి చేసే ప్రత్యేక ఉత్పత్తులను నిరీక్షిస్తున్నారు. Purplle ఆ భరోసాపై నిర్మాణాన్ని కొనసాగించగా, వినియోగదారుల అవసరాలను వినియోగదారుల వినియోగానికి సంబంధించిన డేటాను జాగ్రత్తగా విశ్లేషిస్తుంది మరియు విభిన్నం చేసిన ఉత్పత్తులు మరియు వినియోగదారుల అనుభవంతో అందిస్తుంది. ఈ భాగస్వామ్యం గురించి మేము ఉత్సుకతతో ఉన్నాము మరియు Purplle బృందంతో సన్నిహితంగా ఉంటూ పని చేయడాన్ని నిరీక్షిస్తున్నాము’’ తెలిపారు. గమనార్హమైన ప్రగతికి సాంకేతికత డ్రైవింగ్ ఫోర్స్‌గా ఉంది మరియు సంస్కరణల్లో Purplle ఎక్కువ పెట్టుబడి పెట్టడాన్ని కొనసాగిస్తుంది. ఇది ప్రత్యేకమైన బ్యూటీ ప్రొఫైల్స్, వర్చువల్ ట్రై-ఆన్లు మరియు వర్చువల్ బ్యూటీ అడ్వైజర్ల శిఫార్సుల ద్వారా ఆన్లైన్ సౌందర్య ప్రయాణాన్ని పర్సనలైజ్ చేస్తుంది. Purplleను 2021లో ప్రారంభించిన రోజు నుంచి Purplle మహోన్నతమైన నాణ్యత మద్ధతుతో అందుబాటు ధరలో సౌందర్య ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది తన గ్రాస్ మర్కండైజింగ్ వ్యాల్యూ (GMV)ను గత మూడేళ్లలో 6 రెట్లు వృద్ధి చెందింది మరియు ప్రస్తుతం రూ.1200 కోట్ల రన్ రేట్‌ను కలిగి ఉంది. పర్పుల్ రానున్న 5 ఏళ్లలో 6-8 రెట్లు ప్రగతి సాధించే ప్రణాళికను కలిగి ఉంది.