Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ లీ హెల్త్ డొమెయిన్ వెన్నెముక సమస్యలకు స్పైనోకార్ట్ పేరుతో సహజ సిద్ధ ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేసినట్లు ప్రకటించింది. శక్తివంతమైన పోషకాలతో కూడిన బయోలాజికల్ యాక్టివ్ల కలయికతో దీనిని అభివద్ధి చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. 'ఇందులోని కొలాజెన్, గుడ్డు పెంకు నుంచి తీసిన పొర వెన్నెముక కీళ్లలో మదులాస్థిని మెరుగుపరుస్తాయి. ఈ ఔషదం ప్రధానంగా వెన్నెముక, ఇంటర్వెర్టెబ్రల్ డిస్క్పై యాంటీ ఇన్ఫ్లామేటరీగా పనిచేసి వాపును తగ్గించి, పరిస్థితులను మెరుగుపరుస్తా యి.మూడు వారాల్లో నొప్పుల నుంచి వేగంగా ఉపశమనం లభిస్తుంది.' అని లీ హెల్త్ డొమెయిన్ డైరెక్టర్ లీలా రాణి తెలిపారు.