Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన భాగస్వామిగా స్టాన్పంప్స్
హైదరాబాద్ : వాక్యూమ్ పంప్స్ తయారీలో ఉన్న బెంగళూరు కంపెనీ హెచ్హెచ్వి పంప్స్‌ను స్వీడన్‌కు చెందిన అట్లాస్ కాప్కో ఏబీ కొనుగోలు చేసింది. దీంతో దేశీయంగా మరిన్ని పెట్టుబడులతోపాటు సాంకేతికత అందుకోవచ్చని హెచ్హెచ్వి పంప్స్ భావిస్తోంది. కాగా.. హెచ్హెచ్వి పంప్స్ ఉత్పత్తుల విక్రయ ప్రధాన భాగస్వామిగా హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ గ్రూప్ కంపెనీ స్టాన్పంప్స్ వ్యవహరిస్తోంది. 'ఫార్మా, కెమికల్, అగ్రోకెమికల్ రంగాల్లో దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాం. వాక్యూమ్ విభాగం ఏటా 50 శాతం వద్ధి చెందుతోంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఉత్పత్తులను దేశీయంగా తయారీ, విడుదలకు అట్లాస్ కాప్కో సన్నద్ధం అవుతోంది' అని స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఎండి నాగేశ్వర రావు తెలిపారు.