Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశపు అత్యాధునిక ఏఐఉఎంఎల్ ఆధారిత జాబ్ గ్యారెంటీ ప్రోగ్రామ్ మైఫస్ట్ఎక్స్పీ . ఇంటర్న్షిప్స్ లేదా ఉద్యోగ భద్రత కోసం వెదుకుతున్న వ్యక్తులకు సహాయపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విభాగంలో అగ్రగామి మరియు భారతదేశంలో అతిపెద్ద కో - లివింగ్, స్టూడెంట్ హౌసింగ్ బ్రాండ్ జోలో ఆవిష్కరించిన మైఫస్ట్ఎక్స్పీ ని నేడు హైదరాబాద్‌లో ఆవిష్కరించిన వెంటనే సానుకూల స్పందనను చవిచూసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
జోలో కమ్యూనిటీ వద్ద ఈ ఆలోచన ఉద్భవించింది. మహమ్మారి కాలంలో లీడర్ షిప్ బృందంతో పాటుగా ఆవాసితులు ఉద్యోగాలు కోల్పోయిన వారికి మరో ఉద్యోగం పొందడంలో సహాయపడ్డారు. ఉద్యోగ ఇంటర్వ్యూలకు ఏ విధంగా సిద్ధం కావాలి, ఉద్యోగానికి తగిన విజ్ఞానం ఉండటమనేది ఆ ఉద్యోగం పొందడంలో ఏ విధంగా సహాయపడుతుందనేది సైతం టీమ్ తెలుసుకోగలిగింది. విభిన్నమైన ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రజలు ఏమి అభ్యసిస్తున్నారు మరియు ఉద్యోగాలలోకి తీసుకునేటప్పుడు ఎంప్లాయర్లు ఏమి ఆశిస్తారనే అంశాల నడుమ సమస్యలను తీర్చడమే లక్ష్యంగా మైఫస్ట్ఎక్స్పీ చేసుకుంది.
ఈ నూతన ఆవిష్కరణ గురించి డాక్టర్ నిఖిల్ సిక్రీ, సీఈవో అండ్ కోఉఫౌండర్, మై ఫస్ట్ ఎక్స్పీ మాట్లాడుతూ 'సరైన ఉద్యోగం పొందడంలో విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారమందించేలా ఓ పరిష్కారం తీసుకురావాలన్న స్ఫూర్తిని మహమ్మారి మాకు కలిగించింది. అతి తక్కువ ఉద్యోగార్హతలు కలిగి ఉండటం చేత చాలా మంది తమ కలల ఉద్యోగాలను పొందలేకపోతున్నారు. మైఫస్ట్ఎక్స్పీతో ఉద్యోగార్థులకు, ఉద్యోగులను నియమించుకునే వారికి పరస్పర ప్రయోజనం పొందగలరు` అని అన్నారు.
మైఫస్ట్ఎక్స్పీ సీఓఓ జవహార్ సహుకరు మాట్లాడుతూ 'ఈ కంపెనీ జాబ్ గ్యారెంటీడ్ ప్రోగ్రామ్ ఎక్స్పీ జాబ్స్‌ను సైతం అందిస్తుంది. తమ తొలి ఉద్యోగం లేదా ఉద్యోగ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా తీర్చిదిద్దారు` అని అన్నారు.
మైఫస్ట్ఎక్స్ సీటీఓ అమిత్ దీక్షిత్ మాట్లాడుతూ 'అత్యుత్తమ ఫలితాలకు భరోసానందిస్తూ భారతదేశంలో విప్లవాత్మక వేదికను మెషీన్ లెర్నింగ్ సాంకేతికత తోడుగా మైఫస్ట్ ఎక్స్పీ అభివృద్ధి చేసింది. ఇది స్ర్కీనింగ్, కోర్సు పంపిణీ మొదలు ఇంటర్వ్యూ వరకూ అనుమతిస్తుంది. ఈ వేదిక కృత్రిమ మేథస్సు, మెషీన్ లెర్నింగ్ మోడల్స్‌ను వినియోగిస్తుంది. తద్వారా వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభవాలను సైతం అందిస్తుంది` అని అన్నారు.
మైఫస్ట్ఎక్స్పీ పై ఇప్పటికే 600కు పైగా కార్పోరేట్స్ నుంచి 5వేలకు పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజూ 2వేలకు పైగా అభ్యర్థులను పరీక్షిస్తున్నారు.