Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అవివా నివేశ్ బీమాను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రైవేట్ బీమా కంపెనీ అవివా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాగా, ఇది మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి మొత్తం చెల్లింపుతో పాటు, ప్రతి 5వ పాలసీ ఏడాదిలో హామీతో కూడిన మనీబ్యాక్ను అందిస్తుంది. ఈ విలువ ప్రతిపాదనతో వినియోగదారులు తమ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక అవసరాలను తీర్చేందుకు కావలసిన ప్రత్యేక ప్రయోజనాలకు నిధిని సమకూర్చుకునేందుకు జీవిత బీమా రక్షణను ఆస్వాదించడాన్ని నిర్ధారిస్తుంది.
అవివా నివేశ్ బీమా మెచ్యూరిటీ లేదా డెత్‌పై ఫిక్స్డ్ బెనిఫిట్ పే-అవుట్, పరిమిత ప్రీమియం చెల్లింపు వ్యవధి, యాడ్-ఆన్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ద్వారా కవరేజీని మెరుగుపరిచే ఎంపిక తదితర ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంతేకాకుండా, తమ పెట్టుబడులకు హామీతో కూడిన రాబడిని పొందాలని చూస్తున్న సముదాయంలోని ఔత్సాహిక విలువను కోరుకునే వారిని ఆకర్షించేందుకు దీన్ని డిజైన్ చేశారు. పాలసీకి కనీస వార్షిక ప్రీమియం రూ.25,000 నుంచి గరిష్టంగా రూ.1,00,00,000 వరకు ఉంటుంది, తద్వారా పాలసీ వివిధ బడ్జెట్లు మరియు తక్కువ నుంచి ఒక మోస్తరు రిస్క్‌కు సిద్ధంగా ఉండే వినియోగదారులకు ఇది ప్రయోజనకారిగా ఉంటుంది.
అవీవా లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఫంక్షన్ అధికారి వినిత్ కపాహి మాట్లాడుతూ, 'అనిశ్చిత సమయాల్లో, వినియోగదారులు ముఖ్యంగా భవిష్యత్తులో ఎక్కువగా గ్యారెంటీ లాభాలను అందించే జీవిత బీమా ప్లాన్లను కోరుకుంటారు. ఈ భవిష్యత్-ఆధారిత వినియోగదారుల ఆలోచనలతో మా అవకాశాలను అనుసంధానం చేస్తూ, మేము అవివా నివేష్ బీమాను అందుబాటులోకి తీసుకు వచ్చాము మరియు ఇది పాలసీదారులకు వారి స్వల్ప మరియు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది` అని వివరించారు.
దీని గురించి ఆయన మరింత వివరిస్తూ, 'ఈ ప్రచారం వెనుక ఉన్న ఆలోచనను చిన్న కలల నుంచి పెద్ద లక్ష్యాల వరకు (ఛోటే డ్రీమ్స్ సే బడే గోల్స్ తక్)లో పొందుపరచగా, ఈ సెంటిమెంట్ మా వినియోగదారుల ఆకాంక్షల గురించి మాట్లాడుతుంది. వారికి ఎప్పుడైనా, భవిష్యత్తులో తక్షణమే లేదా దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రోత్సాహం అవసరం కావచ్చు. తద్వారా వారి ప్రియమైన వారిని జీవితంలో అనిశ్చితి నుంచి కాపాడుతుంది.`
అవివా నివేశ్ బీమా ప్లాన్ కీలక ప్రత్యేకతలు:
ప్రీమియం పేమెంట్ టర్మ్ మరియు పాలసీ నిబంధనల ఎంపిక
ప్రీమియంలు చెల్లించేందుకు వార్షిక, అర్థ సంవత్సర మరియు నెలవారీ విధానం
యాడ్ ఆన్ యాక్సిడెంటల్ బెనిఫిట్ కవర్ ద్వారా అదనపు రక్షణను జోడించే ఎంపిక
వార్షిక ప్రీమియానికి 11 రెట్లు డెత్ కవర్
మెచ్యూరిటీ సమయంలో మినహా ప్రతి 5వ పాలసీ సంవత్సరంలో మెచ్యూరిటీ మొత్తంలో 10 శాతం గ్యారెంటీడ్ సర్వైవల్ బెనిఫిట్ లభిస్తుంది.
ఇప్పటికే చెల్లించిన సర్వ్వైవల్ ప్రయోజనాలను మినహాయించిన తర్వాత గ్యారంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్
ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం పన్ను రహిత చెల్లింపులు
ప్రొడక్ట్‌కు వీడియోకి లింక్: అవివా బీమా నివేశ్ / చిన్న కలల నుంచి పెద్ద లక్ష్యాల వరకు..
ప్రొడక్ట్ మరియు దాని ప్రత్యేకతలను మరింత తెలుసుకునేందుకు ఈ వెబ్ సైట్ ను సందర్శించొచ్చు. https://www.avivaindia.com/saving-investment-plans/aviva-nivesh-bima