Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 765 పాయింట్లు ఫట్
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లను ఒమిక్రాన్ తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. అంతర్జాతీయ ప్రతికూలతలకు తోడు వైరస్ భారత్కు పాకిందన్న రిపోర్టులతో మదుపర్లు ఆందోళనకు గురైయ్యారు. దీంతో శుక్రవారం బిఎస్ఇ సెన్సెక్స్ 765 పాయింట్లు లేదా 1.31 శాతం పతనమై 57,696.46కు పడిపోయింది. ఇదే బాటలో ఎన్ఎస్ఇ నిఫ్టీ 205 పాయింట్లు లేదా 1.18 శాతం కోల్పోయి 17,197 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ ఫార్మా రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురైయ్యాయి. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండిస్టీస్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. బిఎస్ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ యథాతథంగా నమోదు కాగా.. స్మాల్ క్యాప్ 0.3 శాతం కోల్పోయింది. మొత్తం సూచీల్లో 1,778 స్టాక్స్ లాభపడగా.. 1,475 సూచీలు నష్టపోయాయి.