Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బ్లాక్ చెయిన్ టెక్నలాజీతో వస్తోన్న క్రిప్టో కరెన్సీలు అత్యంత సురక్షితమని ఆ వర్గాలు చెబుతోంటే.. మరోవైపు ఈ కరెన్సీలో అతిపెద్ద హ్యాంకింగ్ చోటు చేసుకుంది. దీంతో ఈ డిజిటల్ కరెన్సీ భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బ్లాక్చైయిన్ టెక్నాలజీ సంస్థ బాడ్జర్ డీఏఓ పై హ్యాకర్లు దాడి చేసి 120 మిలియన్ డాలర్ల( దాదాపు రూ.900 కోట్లు) కొల్లగొట్టారు. ఈ బాడ్జర్ డిఎఒ ఎథెరియం వేదికను రూపొందించింది. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్చైయిన్ టెక్నాలజీలోనూ హ్యాకర్లు చొరబడటంతో క్రిప్టో కరెన్సీ పరిశ్రమ భద్రతపై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. దొంగలించబడిన క్రిప్టో కరెన్సీని బాధితులకు తిరిగి చెల్లిస్తుందా లేదా అనే దానిపై ఆ కంపెనీ స్పష్టతనివ్వలేదు.