Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభానికి తోడు పెరిగిన సిమెంట్, స్టీల్ ధరలతో ఇప్పటికే నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉంది. కాగా.. దేశంలో బొగ్గు, డీజిల్ ధరలు పెరగడంతో మరోసారి సిమెంట్ ధరలు మరింత పెరుగొచ్చని ప్రముఖ రేటింగ్ ఎజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో రీటైల్ మార్కెట్లో సిమెంట్ బస్తా ధర రూ.10 నుంచి 15కి పెరిగి రూ.380 చేరువలో పలుకుతోంది. వచ్చే కొద్ది రోజుల్లోనే మరో ధర రూ.15 నుంచి రూ.20లకు పెరుగొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. దీంతో సిమెంట్ ధర రూ.400కు ఎగిసే అవకాశం ఉందని పేర్కొంది. గడిచిన అక్టోబర్లో ఉత్తరాది రాష్ట్రాల్లో సిమెంట్ బస్తాపై రూ.12 పెరగ్గా.. దక్షిణాది రాష్ట్రాల్లో ఏకంగా రూ.54 ఎగిసింది.