Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో అత్యంత కీలక బాధ్యతలను చేపట్టనున్నారు. ఇప్పటి వరకు చీఫ్ ఎకనామిస్ట్‌గా ఉన్న ఆమె ఐఎంఎఫ్‌లో తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరక్టెర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఈ హోదాలో ఉన్న జెఫ్రీ మోటో వచ్చే ఏడాది వైదొలగనున్నారు. ఆ స్థానంలో గీతా బాధ్యతలు స్వీకరిస్తారు. మూడేళ్ల పాటు ఐఎంఎఫ్‌లో ఎకానమిస్ట్‌గా చేసిన గీతా గోపినాథ్ త్వరలో దాన్ని వదిలేసి మళ్లీ హార్వర్డ్ వర్సిటీలో అధ్యాపక వత్తిని చేపట్టాలనుకున్నారు. కానీ ఐఎంఎఫ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా సూచన మేరకు డిప్యూటీ ఎండి బాధ్యతల్ని స్వీకరించేందుకు గీతా అంగీకరించారు. గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్‌కు అద్భుత బాధ్యతల్ని నిర్వర్తించారని, తన నాయకత్వంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఓ రూపాన్ని ఇచ్చారని, ఆర్థిక సంక్షోభం వేళ ఆమె చక్కటి ప్రణాళికలు వేశారని జార్జీవా తెలిపారు. ఐఎంఎఫ్ చరిత్రలో తొలిసారి మహిళా చీఫ్ ఎకానమిస్ట్‌గా గీతా గోపీనాథ్ బాధ్యతలు నిర్వర్తించారని ప్రశంసించారు. ప్రస్తుతం ఐఎంఎఫ్ ఎండీగా 68 ఏండ్ల క్రిస్టలీనా జార్జియేవా ఉన్నారు. రెండో అత్యున్నత స్థాయి హోదాలో గీతా గోపినాథ్ నియమితులు కావడంతో ఒక అంతర్జాతీయ సంస్థ కీలక బాధ్యతల్ని ఇద్దరు మహిళలు నిర్వర్తించనున్నారు.