Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వచ్చే వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులకు అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున మార్కెట్లు ఒత్తిడికి గురి కావొచ్చని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 6తో ప్రారంభం కానున్న వారంలో మదుపర్లు మార్కెట్లలో పెట్టుబడులపై అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. యూరోజోన్లో ద్రవ్యోల్బణం రికార్డ్ స్థాయిలో 4.9 శాతం ఎగిసింది. అంతర్జాతీయ పరిణామాలు, ఆర్బిఐ వడ్డీ రేట్ల సమీక్షా, అధిక ద్రవ్యోల్బణం మార్కెట్లపై ప్రభావం చూపొచ్చు. భారత స్టాక్ మార్కెట్ మరింత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం కనిపిస్తోందని.. ఈ దిద్దుబాటు 10 నుంచి 15 శాతం వరకు ఉంటుందని ప్రముఖ మార్కెట్ నిపుణుడు మార్క్ మొబియస్ అంచనా వేస్తున్నారు. మంచి కంపెనీల షేర్ల కొనుగోళ్లకు ఈ దిద్దుబాటు చక్కటి అవకాశమన్నారు. అక్టోబరులో జీవితకాల గరిష్ఠ స్థాయిలను తాకిన సెన్సెక్స్, నిఫ్టీ ఇప్పటికే 7-8 శాతం వరకు నష్టపోయాయి.