Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : పదవీ విరమణ తర్వాత పెరుగుతున్న జీవన వ్యయాలకనుగుణంగా వినియోగదారులు క్రమం తప్పకుండా ఆదాయం పొందడంలో సహాయపపడేందుకు ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా 'గ్యారెంటీడ్ పెన్షన్ ప్లాన్'ను విడుదల చేసినట్లు తెలిపింది. ఖచ్చితమైన రీతిలో క్రమం తప్పని ఆదాయాన్ని వినియోగదారులకు అందిస్తుందని పేర్కొంది. ''గ్యారెంటీడ్ పెన్షన్ ప్లాన్ అనేది వార్షిక ఉత్పత్తి. ఇది తక్షణ మరియు వాయిదా వేసిన వార్షిక ఎంపికలను సైతం అందిస్తుంది. యాన్యుటీ వినియోగదారులు భవిష్యత్లో అంటే రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నప్పటి నుంచి ఆదాయం పొందగలరు. వినియోగదారులు 10 సంవత్సరాల తర్వాత నుంచి ఆదాయం పొందేందుకు తగిన అవకాశాలను ఎంచుకోవచ్చు. సుదీర్ఘకాలం వాయిదా వేయడం వల్ల అధిక మొత్తాలను సైతం వారు అందుకోగలరు. ఈ రెండు అవకాశాలలోనూ వడ్డీరేటును కొనుగోలు చేసిన సమయంలో లాక్ ఇన్ కాలానికనుగుణంగా అందిస్తారు.'' అని ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్స్ బి శ్రీనివాస్ పేర్కొన్నారు.