Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగ బీమా కంపెనీ అవివా లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా మనీబ్యాక్తో కూడిన అవివా నివేశ్ ప్లాన్ను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని ఆ సంస్థ పేర్కొంఇ. ఇది మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి మొత్తం చెల్లింపుతో పాటు, ప్రతి 5వ పాలసీ చెల్లింపు ఏడాదిలో హామీతో కూడిన మనీబ్యాక్ను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ విలువ ప్రతిపాదనతో వినియోగదారులు తమ స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాలను తీర్చేందుకు వీలు కల్పిస్తుందని అవీవా లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఫంక్షన్ అధికారి వినిత్ కపాహి తెలిపారు. పాలసీకి కనీస వార్షిక ప్రీమియం రూ.25,000 నుంచి గరిష్టంగా రూ.1,00,00,000 వరకు ఉంటుందన్నారు. వార్షిక ప్రీమియానికి 11 రెట్లు డెత్ కవర్ను అందిస్తున్నామన్నారు.