Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలెన్ మాస్క్‌కు నష్టం
వాషింగ్టన్ : లగ్జరీ విద్యుత్ వాహనాలు, టెక్ దిగ్గజ కంపెనీ టెస్లా అధినేత ఒక్క పూటలో దాదాపు లక్ష కోట్లు కోల్పోయారు. శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లలో 'టెస్లా' షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఈ పరిణామంతో మాస్క్ ఏకంగా 15.2 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయారు. దీంతో పాటు స్పేస్ఎక్స్ షేర్ల పతనంతో మరో బిలియన్ డాలర్ల (రూ.7500 కోట్లు) సంపద ఆవిరయ్యింది. మొత్తంగా ఒక్కరోజులోనే 16.2 బిలియన్ డాలర్ల (రూ.1.21 లక్షల కోట్లు) సంపద కరిగిపోయింది. అయినప్పటికీ ఎలన్ మస్క్ సంపద విలువ 266.8 బిలియన్లు (రూ.20 లక్షల కోట్లు)గా ఉంది. ఈ మధ్యే కేవలం స్పేస్ఎక్స్ సంపదే వంద బిలియన్ల డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద విలువైన ప్రయివేటు కంపెనీగా స్పేస్ఎక్స్ అవతరించింది. భవిష్యత్తులో స్పేస్ టూరిజానికి ఉన్న డిమాండ్, నాసా లాంటి ఏజెన్సీలతో కాంటాక్ట్‌లు, శాటిలైట్ ఇంటర్నెట్ 'స్టార్‌లింక్' సేవలతో మస్క్ సంపద మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని రిపోర్టులు వస్తున్నాయి.