Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: రీప్లే2021తో దక్షిణాసియాలో అతిపెద్ద సంగీత, ఆడియో స్ట్రీమింగ్ సేవా సంస్ధగా నిలిచిన జియో సావన్, దేశవ్యాప్తంగా ఆడియో స్ట్రీమింగ్ పరంగా తాజా ధోరణులను వెల్లడించడంతో పాటుగా శ్రోతల అభిమానుల ప్లేలిస్ట్స్, ఆర్టిస్ట్‌లు, పోడ్కాస్ట్లను తమ వేదికపై లభించిన సమాచారం విశ్లేషించడం ద్వారా వెల్లడించింది. ఈ సమాచారం జనవరి మరియు నవంబర్ 2021 నడుమ భారతదేశ వ్యాప్తంగాసేకరించారు.
ఆర్ధిక వ్యవస్ధ తిరిగి తెరుచుకోవడంతో, వినియోగదారులు కోవిడ్ ముందు కాలం నాటి వినికిడి ప్రవర్తనకు వచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ ప్లాట్‌ఫామ్‌పై అత్యధికంగా సంగీతం ఆస్వాదిస్తున్నారు. సమీక్షించిన సమాచారం వెల్లడించే దాని ప్రకారం, జస్టిన్ బీబర్ మరియు జుబిన్ నౌటియాల్ లు నెంబర్ 1 స్థానంలో నిలిచారు. జియో సావన్‌పై అత్యధికంగా స్ట్రీమింగ్ చేయబడిన ఆర్టిస్ట్‌లుగా వీరు నిలిచారు. అదే సమయంలో అంతర్జాతీయ కళాకారులైనటువంటి అలన్ వాకర్ మరియు డీజె స్నేక్ మరియు భారతీయ కళాకారులు అర్జిత్ సింగ్, అల్కా యాగ్నిక్‌లు తమ ర్యాంకులను అత్యంత ప్రజాదరణ పొందిన గాయకులుగా ఇంగ్లీష్, హిందీ భాషలలో నిలిచారు. 2021లో అత్యధికంగా స్ట్రీమ్ చేయబడిన కె–పాప్ బ్యాండ్‌గా బీటీఎస్ నిలిచింది.
ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌లు సృష్టించిన పాటలు విభిన్నమైన జెనర్‌లో రావడంతో పాటుగా వీటిని అపూర్వంగా సంగీతాభిమానులు ఆస్వాదించారు. వైవిధ్యమైన కమ్యూనిటీతో కూడిన అభిమానులు దీనికి కారణం. వీరు భారతీయ కళాకారులు సృష్టించిన నూతన సంగీతాన్ని అనుసరిస్తున్నారు. ఇండిపెండెంట్ ఇండియన్ ఆర్టిస్ట్‌లు అయినటువంటి బీ ప్రాక్, పాయల్ దేవ్, స్టెబిన్ బెన్ లు ఈ ప్లాట్‌ఫామ్‌పై అగ్రశ్రేణి కళాకారులుగా నిలిచారు.
పాటల పరంగా చూస్తే ‘పీచెస్’, ‘స్టే’ , ‘ఎట్ మై వర్క్’ వంటివి ఆంగ్ల భాషలో అత్యధికంగా స్ట్రీమ్ చేయబడిన పాటలుగా నిలిచాయి. అంతర్జాతీయ మ్యూజిక్ పరంగా పాప్ ఇప్పటికీ ఎక్కువ మంది అభిమానించే అంతర్జాతీయ సంగీతంగా నిలిచింది. తెషెర్ పాడిన ‘జలేబీ బేబీ’, ధరియా యొక్క ‘షుగర్ అండ్ బ్రౌనీస్’ 2021లో అత్యధికంగా స్ట్రీమ్ చేసిన పాటలుగా ఉన్నాయి. ఇక హిందీ పాటల పరంగా ‘లుట్ గయే’ అత్యధికంగా స్ట్రీమ్ చేయబడిన పాటగా నిలిస్తే అనుసరించి ‘థోడా థోడా ప్యార్’ , ‘బారిష్ బన్ జానా’ ఉన్నాయి. 2021 ఆరంభంలో నూతన విడుదల ఆగిపోవటం వల్ల పాత జాబితాలో ఉన్న అంటే 12 నెలల పాత పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. కుమార్ సాను, అల్కా యాగ్నిక్ల ‘మేరా దిల్ భీ కిత్నా పాగల్ హై’ పాట ఈ యాప్ పై టాప్ 20 పాటలలో ఒకటిగా నిలిచింది.
ఓ జెనర్గా కె–పాప్ స్థిరమైన వృద్ధిని ఏప్రిల్ 2021 నుంచి ఆగస్టు 2021 నడుమ చూసింది. అప్పటి నుంచి స్ధిరంగా ఇది వృద్ధి చెందుతూనే ఉంది. పాప్ కాకుండా ఈడీఎం, హిప్హాప్ ల పరంగా పురోగమన ధోరణి కనిపిస్తుంది. దైవ సంబంధిత మరియు దేశీ హిప్ హాప్‌లు కూడా ఆదరణ పొందుతున్నాయి. డివోషనల్ అనేది ఓ జెనర్గా జూలై 2021 నుంచి గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఇది ప్రతి నెలా అంతకు ముందు నెలతో పోలిస్తే వృద్ధిని కనబరుస్తూ అక్టోబర్ 2021లో ఆల్ టైమ్ హై ను ఈ సంవత్సరంలో నమోదు చేసింది. 2020 చివరి నుంచి ఈ విభాగం ఔట్పెర్ఫార్మర్గా నిలిచింది. దేశీ హిప్హాప్ సైతం జూలై 2021 నుంచి వృద్ధి నమోదు చేస్తుంది.
ఇంగ్లీష్, హిందీ కాకుండా టాప్ 5 ప్రాంతీయ భాషలు జియో సావన్‌పై అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. ఈ భాషలలో తెలుగు, పంజాబీ, తమిళ్, భోజ్‌పురి, కన్నడ (అక్టోబర్ 2021) ఉన్నాయి. ప్రాంతీయ భాషలలో అత్యధికంగా తెలుగు భాష గీతాలు స్ట్రీమ్ అయ్యాయి. ప్రాంతీయ భాషలలో భోజ్‌పురి నూతనంగా చేరింది. జనవరి నుంచి అక్టోబర్(30% వృద్ధి)ను గరిష్టంగా చేరుకుంది. 2021లో శ్రోతలు పోడ్కాస్ట్స్ను వినియోగించడం పెరిగింది. వినోదం మరియు సమాచారం కోసం ప్రాధాన్యతా మార్గంగా దీనిని భావిస్తున్నారు. హిందీ పోడ్కాస్ట్స్ ఈ సంవత్సరమంతా పురోగమన దిశను చూపితే, బెంగాలీ పోడ్కాస్ట్స్ ఏప్రిల్ మరియు ఆగస్టు 2021లో మాత్రమే వృద్ధిని చూశాయి. ఓ విభాగంగా,స్టోరీస్ కు శ్రోతల నుంచి అపూర్వ ఆదరణ లభించింది.
జియోసావన్ విడుదల చేసిన ఈ సమాచారం, ఆసక్తికరమైన ధోరణులను చూపడంతో పాటుగా దేశపు శ్రోతల ప్రవర్తన పరంగా మార్పులనూ వెల్లడించింది. ఆడియో స్ట్రీమింగ్ పరిశ్రమలో శక్తివంతమైన వృద్ధిని ఇది వెల్లడించడంతో పాటుగా వినోద ప్రపంచంలో ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్రాముఖ్యతను సైతం వెల్లడించింది. నిరంతర ఆవిష్కరణ ప్రాముఖ్యతను ఇది వెల్లడించడంతో పాటుగా ప్రేక్షకుల ప్రాధాన్యతలను వినాల్సిన అవసరమూ తెలిపింది. ప్రేక్షకులు వినూత్నమైన అనుభవాలను కోరుకుంటున్నారిప్పుడు. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ఒక రూపాయికే ఒక నెల చందాను పరిమిత కాల ఆఫర్‌గా విడుదల చేయనుంది. ఈ ఆఫర్‌ను 15 డిసెంబర్ లో ఆవిష్కరించనున్నారు మరియు జియో వినియోగదారుల కోసం మాత్రమే ఇది 31 డిసెంబర్ 2021 వరకూ అందుబాటులో ఉంటుంది.