Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ట్రాక్టర్ పరిశ్రమ వద్ధిని సైతం అధిగమిస్తూ తాము నవంబర్లో అత్యధిక మార్కెట్ వద్ధిని నమోదు చేసినట్లు ఈ రంగంలోని సోనాలిక ట్రాక్టర్స్ తెలిపింది. గడిచిన మాసంలో 11,909 ట్రాక్టర్లను విక్రయించినట్లు తెలిపింది. దీంతో గతంతో పోల్చితే మార్కెట్ వాటాలో 1.4 శాతం పెరిగి 16 శాతానికి చేరిందని వెల్లడించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 22,268 ట్రాక్టర్లను ఎగుమతి చేసినట్లు తెలిపింది. గతేడాది నవంబర్లో 1607 ట్రాక్టర్లను సోనాలికా ఎగుమతి చేయగా, గడిచిన నెలలో 100.7 శాతం వృద్థితో 3,225 యూనిట్లను ఎగుమతి చేసినట్లు పేర్కొంది.