Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర రూ.31.99 లక్షలు
ముంబయి : ప్రీమియం కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగెన్ తన నూతన టిగున్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌షోరూం వద్ద దీని ధరను రూ.31.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ ఆల్‌రౌండర్ టిగున్, తమ మెరుగైన డిజైన్ భాష, అసాధారణ పనితీరు, ప్రీమియం ఫీచర్లతో తమ విభాగంలో వినియోగదారుల కోసం అత్యుత్తమ శ్రేణి ఆఫరింగ్గా నిలుస్తుందని ఆ కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. దీన్ని ఔరంగాబాద్‌లోని కేంద్రంలో స్థానికంగా అసెంబల్ చేసినట్లు తెలిపింది. 2.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్‌కు 7 స్పీడ్ డిఎస్జి ట్రాన్స్‌మిషన్‌ను 4మోషన్ టెక్నాలజీతో అనుసంధానించినట్లు తెలిపింది. ఈ నూతన టిగున్ లీటర్‌కు 12.65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొంది. బుకింగ్స్ తెరిచామని.. జనవరి 2022 మధ్య నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని వెల్లడించింది.