Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· గత సంవత్సరంతో పోలిస్తే 54% వృద్ధిని నవంబర్,2021లో చేరుకుంటూ 9477 ఎంయు నమోదు చేసిన ఐఈఎక్స్
· రియల్ టైమ్ విద్యుత్ మార్కెట్ 1311 ఎంయుగా ఉండటంతో పాటుగా అత్యద్భుతంగా 47% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధి సాధించింది
· ఇయర్ ఆన్ ఇయర్ 178% వృద్ధితో గ్రీన్మార్కెట్లో 457 ఎంయు వాల్యూమ్ సాధించింది
· ఫనవంబర్ 24, 2021న ఎక్సేంజ్ వద్ద ట్రేడింగ్ సెషన్లో 24.44 లక్షల ఆర్ఈసీలు ట్రేడ్ అయ్యాయి
న్యూఢిల్లీ: నవంబర్ 2021లో ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజ్ (ఐఈఎక్స్) వద్ద 9477 ఎంయు వాణిజ్యం జరిగింది. దీనిలో సంప్రదాయ విద్యుత్ మార్కెట్ 6333 ఎంయును గ్రీన్ పవర్ మార్కెట్ 457ఎంయు, 2687 ఎంయును ఈఎస్సెర్ట్స్, ఆర్ఈసీలతో కూడిన సర్టిఫికెట్ మార్కెట్లో నమోదు చేసింది. మొత్తంమ్మీద అన్ని మార్కెట్ విభాగాలలోనూ 53.8% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధిని ఎక్సేంజ్ నమోదుచేసింది.
నేషనల్ లోడ్ డిశ్పాచ్ సెంటర్ ప్రచురించిన పవర్ డిమాండ్ డాటా ప్రకారం, జాతీయ స్థాయిలో గరిష్ట డిమాండ్ ఈ నెలలో 166.19 గిగావాట్ గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ అత్యధికంగా 3.2% వృద్ధిని ఈ నెలలో నమోదు చేయడంతో పాటుగా విద్యుత్ వినియోగం 100.4 బీయు వద్ద 2.1% వృద్ధిని ఇయర్ ఆన్ ఇయర్ పద్దతిలో నమోదు చేసింది.
ఎలక్ట్రిసిటీ మార్కెట్: డే–ఎహెడ్, టర్మ్–ఎహెడ్ మరియు రియల్ టైమ్ మార్కెట్స్
ఈ నెలలో డే–ఏహెడ్ మార్కెట్ 4719 ఎంయు వాల్యూమ్‌ను నవంబర్ 2021లో నమోదు చేసింది. తద్వారా ఇయర్ ఆన్ ఇయర్ 3% తరుగు నమోదైంది. సరాసరి ధర ఒక్కో యూనిట్‌కు 3.1 రూపాయలు. తద్వారా గణనీయంగా మంత్ ఆన్ మంత్ 62% క్షీణతను నమోదుచేసింది. దీనికి ప్రధానంగా సరఫరా పరంగా 1.8 రెట్ల వద్ద సెల్– బిడ్స్ వాల్యూమ్ క్లియర్ చేయడంతో పాటుగా లిక్విడిటీ పెరగడం కారణం. ఇది విద్యుత్ విస్తారంగా లభిస్తుందనే భరోసా అందించింది మరియు డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీలు మరియు పరిశ్రమలకు సరసమైన సేకరణ అవకాశాలనూ కల్పించింది.
ఇంట్రా డే, కంటింజెన్సీ, డెయిలీ, వీక్లీ కాంట్రాక్ట్స్‌తో కూడిన టర్మ్ ఎహెడ్ మార్కెట్ 302.7 ఎంయు వాణిజ్యంను ఈ నెలలో చేసింది. తద్వారా 23.4% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధిని నమోదుచేసింది. రియల్ టైమ్ ఎలక్ట్రిసిటీ మార్కెట్ వాల్యూమ్స్ 1311 ఎంయుకు చేరడంతో పాటుగా గణనీయంగా 47% ఇయర్ ఆన్ఇయర్ వృద్ధిని చూసింది. సరాసరి నెలవారీ ధర 3.48 రూపాయలు/యూనిట్ గా ఉంది. అత్యధిక సింగిల్ డే వాల్యూమ్‌ను 18నవంబర్ 2021న 56.16ఎంయుగా నమోదు చేసింది. ఆ రోజు 554 పార్టిస్పెంట్స్ మార్కెట్ లో లావాదేవీలను నిర్వహించారు. రియల్ టైమ్ విద్యుత్ మార్కెట్ స్ధిరమైన వృద్ధిని వాల్యూమ్స్ పరంగా జూన్ 2020 నుంచి నమోదు చేస్తూనే ఉంది. ఈ మార్కెట్ విజయవంతంగా పంపిణీ యుటిలిటీలకు తోడ్పాటునందించింది. రియల్ టైమ్ డిమాండ్–సరఫరా రంగంలోని పరిశ్రమలు అత్యంత సమర్ధవంతమైన సౌకర్యవంతమైన పద్ధతిలో సమతుల్యత పాటించాయి.
గ్రీన్ మార్కెట్ డే ఏహెడ్, టర్మ్ ఎహెడ్ మార్కెట్స్
డే ఎహెడ్, టర్మ్ ఎహెడ్ కాంట్రాక్ట్స్‌తో కూడిన ఐఈఎక్స్ వద్ద గ్రీన్ మార్కెట్ , ఈ నెలలో మొత్తంమ్మీద 457 ఎంయు వాల్యూమ్‌ను చేరుకుంది. గ్రీన్ డే ఎహెడ్ మార్కెట్ 149.46 ఎంయు వాల్యూమ్‌ను ఈ నెలలో వెయిటెడ్ యావరేజ్ యూనిట్‌కు 3.72 రూపాయల ను నమోదు చేసింది. ఈ మార్కెట్లో మొట్టమొదటిసారిగా 26 అక్టోబర్ 2021 లో కార్యక్రమాలు ఆరంభించిన తరువాత పూర్తి స్ధాయిలో ఒకనెలలో కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మొత్తంమ్మీద 93 మంది పార్టిస్పెంట్స్ ఈ వాణిజ్యంలో పాల్గొన్నారు.
గ్రీన్ టర్మ్ ఎహెడ్ మార్కెట్ 307 ఎంయు వాల్యూమ్‌ను చేరుకుంది. గణనీయంగా ఇయర్ ఆన్ ఇయర్ 94% వృద్ధి నమోదు చేసింది. ఈ మార్కెట్లో 29 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్, హర్యానా, తెలంగాణా, కర్నాటక, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి కీలకమైన పంపిణీ సంస్ధలు దీనిలో ఉన్నాయి.
పునరుత్పాదక విద్యుత్ ధృవీకరణ మార్కెట్
నియంత్రణ సంస్థల పరిణామాలతో పాటుగా సీఈఆర్సీ తేదీ 18 నవంబర్ 2021కు అనుగుణంగా ఐఈఎక్స్ ఇప్పుడు ఆర్ఈసీలోవాణిజ్యంను బుధవారం , నవంబర్ 24 , 2021న దాదాపు 16 నెలల విరామం తరువాత ప్రారంభించింది. మొత్తం వాల్యూమ్ పరంగా 2444.35 ఎంయు వాణిజ్యం జరిగింది.
ఈ ఎక్సేంజ్ అత్యద్భుతమైన స్పందనను చవిచూసింది. మొత్తంమ్మీద 800కు పైగా అభ్యర్థులు దీనిలో పాల్గొన్నారు. వీరంతా కూడా తమ ఆర్పీఓ మరియు వలెంంటరీ ఆబ్లిగేషన్ల కోసం ఈ కార్యక్రమాల పునరుద్ధరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారే.
ఈ ఎక్సేంజ్ మొత్తంమ్మీద 24.4 లక్షల పునరుత్పాదక విద్యుత్ సర్టిఫికెట్స్ ను నవంబర్‌లో వాణిజ్యం చేసింది. దీనిలో 21.90లక్షల నాన్ సోలార్ ఆర్ఈసీలు మరియు 2.53 లక్షల సోలార్ ఆర్ఈసీలు ఉన్నాయి. సోలార్ ఆర్ఈసీకి రూ.2000, నాన్ సోలార్ ఆర్ఈసీలకు రూ.1000 ధరను ఎక్సేంజ్ ప్లాట్‌ఫామ్ కనుగొంది.
ఎనర్జీ సేవింగ్స్ సర్టిఫికెట్స్
ఎనర్జీ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఈఎస్సెర్ట్స్) అండర్ పెర్ఫార్మ్, అావ్ అండ్ ట్రేడ్ సైకిల్ 2 కింద ఐఈఎక్స్ వాణిజ్యం 26 అక్టోబర్ 2021న ప్రారంభించింది.
నవంబర్ 2021లో ఈ ఎక్సేంజ్ 242,733 ఈఎస్సెర్ట్స్లో వాణిజ్యం పూర్తి చేసి, 242.73 ఎంయు ట్రేడ్ వాల్యూమ్ నమోదు చేసింది.
విద్యుత్ మంత్రిత్వ శాఖ 25నవంబర్ 2021న జారీ చేసిన ఆదేశాలకనుగుణంగా డిసెంబర్ 31,2021 వరకూ వాణిజ్యంను నిలుపుదల చేయడం జరిగింది.