Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· మమేకమైన భిన్నత్వాలు (ఆపోజిట్స్ యునైటెడ్) అన్న కంపెనీ యొక్క ప్రశంశాత్మకమైన డిజైన్ సిద్ధాంతానికి నిలువెత్తు రూపం కియా కారెన్స్
· సాహసోపేతమైన, వీరోచితమైన వెలుపలి డీజైన్కు తగిన విధంగా ఉంటుంది సౌందర్యభరిమైన మరియు ఉత్కృష్టమైన క్యాబిన్. వీటితో కారెన్స్, ఆధునిక భారతీయ కుటుంబాలకు చక్కగా అనువుగా ఉంటుంది
· కియా భారతదేశంలో విడుదల చేసే నాలుగవ ఉత్పత్తి కారెన్స్ కానున్నది
హైదరాబాద్: కియా కంపెనీ వారు 16 డిసెంబర్ 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారని అందరూ ఎదురుచూస్తున్న కియా కారెన్స్ స్కెచ్లను కియా ఇండియా విడుదల చేసింది. విలాసంవతమైన ఇంటీరియర్లు, స్మార్ట్ అయిన కనెక్టివిటీ ఫీచర్లు, సాహసోపేతమైన ఎక్స్టీరియర్లు మరియు మూడవ వరుసతో సహా వాహనంలో కూర్చునే వారందరికీ సౌకర్యవంతంగా ఉండేంత చోటుతో కియా కారెన్స్ భారతదేశంలో వినోదాన్ని అందించే వాహనాల కొత్త శ్రేణిని సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నది. కలిసి ప్రయాణాలను ఆనందించాలని కోరుకునే ఆధునిక భారతీయ కుటుంబాల యొక్క పుట్టుకొస్తున్న అవసరాలను మరియు ఇంకా తీర్చని అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కియా కారెన్సును రూపొందించటం జరిగింది.
కియా కారెన్స్, తమ కంపెనీ యొక్క కొత్త డిజైన్ సిద్ధాంతం - ‘మమేకమైన భిన్నత్వాల’ను భారతదేశంలో ప్రారంభించింది. ప్రకృతిలోనూ, మానవులలోనూ కనిపించే భిన్నత్వాలనుండి స్ఫూర్తిని ఈ సాహసోపేతమైన డిజైన్ స్వరూపం కోసం తీసుకోవటం జరిగింది. ఈ డిజైన్ సిద్ధాంతం, ఐదు బలమైన స్థంభాలపై నిలిచి ఉన్నది. ప్రకృతి కోసం సాహసం (బోల్డ్ ఫర్ నేచర్), కారణం కోసం ఆనందం (జాయ్ ఫర్ రీజన్), పురోగమించేందుకు శక్తి (పవర్ టు ప్రోగ్రెస్), జీవితం కోసం సాంకేతికపరిజ్ఞానం (టెక్నాలజీ ఫర్ లైఫ్), మరియు ప్రశాంతత కోసం ఉద్రిక్తత (టెన్షన్ ఫర్ సెరెనిటీ). కారెన్స్ డిజైన్, బోల్డ్ ఫర్ నేచర్ ఇతివృత్తం పై ఆధారపడినది. ప్రకృతిలోని పరిపూర్ణత, నిరాడంబరతకు నివాళులిస్తూనే, బ్రాండ్ యొక్క కొత్త డిజైన్ దిశతో వాటిని అనుసంధానిస్తుంది.
కంపెనీవారి విలక్షణమైన, శక్తివంతమైన డిజైన్ భాషను నిబిడీకృతం చేసి, తన స్వభావంలో యవ్వనాన్ని పోతపోసుకున్నది. దీని ఎక్స్టీరియర్ హై-టెక్ స్టైలింగ్ సొబగులను చూపుతుంది. అందులో భాగంగా కియావారి విలక్షణమైన టైగర్ ఫేస్ డిజైన్ ముందు భాగంలోను, కొట్టొచ్చినట్లు కనిపించే ఇన్‌టేక్ గ్రిల్, ఎల్ఇడి హెడ్‌ల్యాంప్‌లు, డేటైమ్ రన్నింగ్ లైట్లు (డిఆర్ఎల్లు) కనిపిస్తూంటాయి. ఇవన్నీ కలిపి వాహనానికి ఒక బలమైన మరియు ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తాయి. ఎస్యువి వంటి సైడ్ ప్రొఫైల్ దీనికి ఒక ఠీవితో కూడిన స్టాన్సును ఇచ్చి, వాహనం యొక్క బలమైన మరియు రిఫైన్డ్ స్టైల్‌ను ప్రస్ఫుటంగా కనిపించేట్లు చేస్తుంది. భారతదేశంలో మొబిలిటీ జీవనశైలికి మరియు దైనందిన వాడకపు ప్రాధాన్యతలకు అనువుగా ఇంటీరియర్‌ను డిజైన్ చేయటం జరిగింది. హై-టెక్ రాప్అరౌండ్ డాష్ డిజైన్, ఒక అధునాతన చిత్రాన్ని కట్టెదుట నిలుపుతూ, విశాలమైన మరియు విలాసవంతమైన క్యాబిన్ యొక్క భావనను కలిగిస్తుంది. డోర్ల పై ఉపయోగించిన క్రోమ్ గార్నిష్ అత్యుత్తమమైన భావనను మరింత ఇనుమడింపజేస్తుంది. 10.25 అంగుళాల ఆడియో వీడియో నావిగేషన్ టెలీమాటిక్స్ (ఎవిఎన్టి) డాష్ మధ్యభాగంలో నెలకొని ఉండి, ఒక ఆధునిక పరిసరాలన భావనను అందిస్తుంది.
“కియా కారెన్స్ మా తాజా డిజైన్ సిద్ధాంతం ‘మమేకమైన భిన్నత్వాలు’కు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. క్రీడాత్మకతను, అధునాతనమైన వ్యక్తిత్వంతోను, విలక్షణమైన సౌందర్యభరితమైన స్టైల్‌తోనూ ఇది విజయవంతంగా మేళవిస్తుంది,” అని కరీమ్ హబీబ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కియా డిజైన్ సెంటర్ హెడ్ చెప్పారు. “మూడు వరుసల తమ వాహనాల నుండి నేటి కస్టమర్లు కోరుకునేదానికి కియా కారెన్స్ నిజమైన ప్రతిబింబంలా ఉంటుంది.”