Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పి2పి రుణ వితరణలో విస్తృతావకాశాలు
హైదరాబాద్: వ్యక్తి నుంచి వ్యక్తికి (పి2పి) రుణ వితరణలో విస్తృతావకాశాలు ఉన్నాయని ఎస్ఆర్ఎస్ ఫిన్టెక్కు చెందిన ఆక్సిలోన్స్.కమ్ సిఇఒ రాధా క్రిష్ణ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే వేల కోట్ల అప్పులివ్వడానికి.. తీసుకోవడానికి అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే తమ నెట్వర్క్, వ్యాపార విస్తరణకు నూతన అవకాశాలపై దృష్టి పెట్టామన్నారు. ఇందుకోసం కొత్తగా 'నియో బ్యాంక్'ను ఆవిష్కరించామన్నారు. దీని ద్వారా ఎవరైనా ఎజెంట్లుగా చేరి.. రుణ గ్రహీతలు, రుణ దాతలను చేర్చితే తమకు కమీషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. తమ ఆక్సిలోన్ వేదికపై పొందే రుణాలపై 12 నుంచి 36 శాతం వడ్డీ రేట్లను అమలు చేస్తున్నామన్నారు. ఖాతాదారుల సిబిల్ స్కోర్్ను బట్టి వడ్డీ రేటును నిర్ణయించనున్నామన్నారు. రుణదాతలు ఏడాదికి సగటున 18 శాతం వడ్డీ రేటును పొందుతున్నారన్నారు. 2022-23 నాటికి ప్రతీ పండగ సమయంలో రూ.7వేల కోట్ల వ్యాపారాన్ని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకునే ప్రయత్నంలో ఉన్నామన్నారు.