Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సమున్నతి ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన లాభాపేక్షలేని అనుబంధ సంస్థ సమున్నతి ఫౌండేషన్ మరియు ఐఐటీ మద్రాస్ ఇన్క్యుబేషన్ సెల్ (ఐఐటీఎంఐసీ)లు ఓ అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశాయి. దీని ద్వారా భారతదేశంలో వ్యవసాయం మరియు సంబంధిత రంగాలలో వినూత్నమైన సాంకేతికతలను ప్రోత్సహించడం మరియు అగ్రిటెక్ స్టార్టప్స్‌కు తగిన ప్రాచుర్యం కల్పించడం ద్వారా రైతుల ఆదాయం మెరుగుపరచడం, వ్యర్థాలను తగ్గించి, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం చేయనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా, ఈ సంస్థలు అగ్రిటెక్ వ్యాపార సంస్థలకు ఇన్క్యుబేషన్ సహాయం/సౌకర్యాలను అందించడంతో పాటుగా పొజిషన్ పేపర్లను సిద్ధం చేయడం, పాలసీ రికమెండేషన్స్‌ను ప్రతిపాదించడం చేయనున్నారు. ఈ భాగస్వామ్యంతో సమున్నతి ఫౌండేషన్ సేవలు సరైన సేవలు పొందని అగ్రిటెక్ వ్యాపార సంస్థల వ్యవస్థాపకుల జీవితాలలో స్పష్టమైన వ్యత్యాసాన్ని సృష్టించడం లక్ష్యంగా చేసుకుంది. ఐఐటీఎంఐసీతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా సమున్నతి ఇప్పుడు వ్యూహాత్మక మరియు నిర్వహణ మార్గదర్శనం, శిక్షణ, మెంటారింగ్, నెట్వర్కింగ్ మరియు ఇతర అవసరమైన వనరులను అందించడం లక్ష్యంగా చేసుకుంది. తద్వారా భారతదేశపు మహోన్నతమైన అగ్రిటెక్ స్టార్టప్స్ తమంతట తాముగా కార్యకలాపాలు ఆరంభించడంతో పాటుగా తమ ఉనికిని విస్తరించుకోగలవు. అనిల్‌కుమార్ ఎస్జీ, ఫౌండర్ అండ్ సీఈవో, సమున్నతి వారు ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ ‘‘మనం ఓ దేశంగా, ముఖ్యంగా వ్యవసాయంలో వ్యవస్థాపక శక్తి పరంగా ఉత్సాహాన్ని చూస్తున్నాము. పలు ఐఐటీ/ఐఐఎంల నుంచి యువతరం వ్యవసాయ రంగంలో వ్యాపారాలను చేయాలనుకోవడం సంతోషంగా ఉంది. ఈ యువ స్టార్టప్స్‌లో భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులు వెళ్తుండటం మేము చూస్తున్నాము. ఓ ఎకోసిస్టమ్ ప్లేయర్‌గా, సమున్నతి ఈ వ్యవసాయక శక్తికి తగిన ప్రోత్సాహాన్ని ప్రీమియర్ ఇనిస్టిట్యూట్లతో భాగస్వామ్యం చేసుకుని ఇన్క్యుబేట్ చేయడం ద్వారా అందించడంతో పాటుగా ఈ ఆలోచనలను ప్రోత్సహించి, వ్యాప్తి చేయనుంది. ఇది చిన్న రైతులపై దృష్టి సారించే అగ్రిటెక్ స్టార్టప్స్ దేశంలో వ్యవసాయ రంగాన్ని సమూలంగానూ మార్చనుంది. ఐఐటీ మద్రాస్ ఇన్క్యుబేషన్ సెల్‌తో ఈ బాగస్వామ్యం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఐఐటీ మద్రాస్ ఇన్క్యుబేషన్ సెల్ ఎన్నో డీప్‌టెక్, సోషల్ స్టార్టప్స్ వృద్ధి చెందడంతో పాటుగా విజయవంతంగా వ్యాప్తి చెందడంలో తోడ్పడింది. ఐఐటీ ఎంఐసీ ఇప్పుడు వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరించడం చేత, వ్యవసాయ రంగంలో స్టార్టప్స్, భారీ పునరుద్ధరణను చూస్తాయని మేము నమ్ముతున్నాము’’ అని అన్నారు.
ఈ భాగస్వామ్యం గురించి ప్రొఫెసర్ అశోక్ ఝుంఝుంవాలా, అధ్యక్షుడు, ఐఐటీఎం ఇన్క్యుబేషన్ సెల్ మరియు ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్ మాట్లాడుతూ ‘‘ఈ భాగస్వామ్యం , వ్యవసాయం మరియు సంబంధిత విభాగాలలో వినూత్నమైన సాంకేతికతలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. వ్యవస్థాపకులకు మద్దతునందించే అనుకూల వాతవరణాన్ని అభివృద్ధి చేయడానికి మేము కృషి చేయడంతో పాటుగా ఉమ్మడిగా ఈ విభాగంలో స్టార్టప్స్‌ను ఇన్క్యుబేట్ చేయనున్నాం. ఈ భాగస్వామ్యం ఉత్పత్తి అభివృద్ధి కోసం మెంటరింగ్ సహాయం, సలహా సేవలు, వ్యాపారాభివృద్ధి కొరకు నెట్వర్కింగ్, శిక్షణ, ఆర్ధిక మరియు సాంకేతిక సహాయం అందిస్తూనే వ్యవసాయ వ్యవస్థాపక అనుకూల వాతవరణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుంది’’ అని అన్నారు.
సుస్థిర వ్యవసాయం కింద ప్రత్యేకంగా, సంయుక్తంగా అన్వేషించబడే సాంకేతికతలు మరియు ముఖ్యమైన విషయాలు:
1. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం – తృణధాన్యాలపై పరిశోధన మరియు తృణధాన్య ఆధారిత ఆహారాలను వాణిజ్యీకరణ ద్వారా ప్రోత్సహించడం
2. హరిత వ్యవసాయ ఆధారిత అనుకూల వాతవరణాన్ని అభివృద్ధి చేయడం – హరిత వ్యవసాయ ఆధారిత యంత్రాలు, సోలార్ పంపులు, సాంకేతిక ఉత్పత్తుల కొరకు ఆర్థిక సహాయం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం విద్యుత్ వాహనాలు.
3. ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ – దేశీయంగా అభివృద్ధి చేయబడిన మధ్య తరహా సాంకేతికతలతో పొషకాహార విలువలు కోల్పొకుండా స్ధానికంగా ప్రీ ప్రాసెస్ ప్యాకేజ్డ్ ఆహారం చేయడం
4. వ్యవసాయ సమాజం కోసం మద్దతు సేవలు – రైతులకు ఉత్పత్తుల కొనుగోలు మరియు అమ్మకం, ఫైనాన్స్, ధరల హెచ్చుతగ్గులకనుగుణంగా భీమా, వాతావరణ ఒడిదుడుకులు, వ్యవసాయ సలహాలు, రవాణా మరియు వ్యవసాయ యంత్రాల కిరాయి, కూలీలను నియమించుకోవడం వంటి వాటికి సహాయం చేయడం.