Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: డయాలసిస్ సంరక్షణలో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్థ బాక్ట్సర్ ఆసియా పసిఫిక్ (బాక్ట్సర్) నేడు ఇండియా, సింగపూర్, వియత్నాం, తైవాన్, మలేషియా, థాయ్‌ల్యాండ్ సహా ఆసియా పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల(సీకెడీ) తో బాధపడుతున్న రోగులకు మద్దతునందించేందుకు సమగ్రమైన ఆన్లైన్ పోర్టల్ మై కిడ్నీ జర్నీని ఆవిష్కరించింది. సీకెడీలకు సంబంధించిన అదనపు సమాచారం అయినటువంటి లక్షణాలు, కారణాలు, దశలతో పాటుగా సీకెడీ నిర్వహించడానికి అందుబాటులో ఉన్న చికిత్సావకాశాలను సైతం తెలుపుతుంది. వీటితో పాటుగా హోమ్ హెమియోడయాలసిస్ (హోమ్ హెచ్డీ), పెరిటోనియల్ డయాలసిస్ (పీడీ) , ఇన్ సెంటర్ డయాలసిస్కేర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ వంటి అంశాలను సైతం తెలుపుతారు. నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెడ్ కావడంతో పాటుగా పెరిటోనియల్ డయాలసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా గౌరవ సెక్రటరీ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు మాట్లాడుతూ ‘‘సీకెడీ పెరిగే కొద్దీ ఆందోళన, ఒత్తిడికి గురవడం సహజం. మార్పిడి చికిత్సలు తప్పనిసరి అవుతుంటాయి. నమ్మకమైన ఆన్లైన్ వనరులు అయినటువంటి మై కిడ్నీ జర్నీ లేదా ఆఫ్‌లైన్ సోర్స్‌ల ద్వారా సమాచారం లభించినట్లయితే సీకెడీ రోగులు మరింత ఉత్తమమైన ఎంపికలను చేసుకోగలరు. తద్వారా మరింత మెరుగైన చికిత్సను పొందగలరు’’ అని అన్నారు.
‘‘ఆధునిక పీడీ (పెరిటోనియల్ డయాలసిస్)తో పాటుగా హోమ్ మరియు ఇన్ సెంటర్ హెమియోడయాలసిస్ (హెచ్డీ) చికిత్సలు మరియు సేవలలో మా నిరంతర ఆవిష్కరణ ద్వారా సీకెడీ రోగులలో జీవిత నాణ్యత మెరుగుపరచడంతో పాటుగా వారి రక్షణను సైతం మెరుగుపరచడాన్ని బాక్ట్సర్ లక్ష్యంగా చేసుకుంది’’ అని ఆండ్రూ ఫ్రే, ప్రెసిడెంట్, బాక్ట్సర్ ఆసియా పసిఫిక్ అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘సీకెడీ నిర్వహణ కోసం ఒకటే నమూనా అందరికీ సరిపోతుందని చెప్పలేము. అయితే, ఈ నూతన ఆన్లైన్ పోర్టల్ , రోగులకు అవసరమైన విజ్ఞానం, వనరులను అందిస్తుంది. తద్వారా వారు మరింత మెరుగ్గా తమ ఆరోగ్యం కోసం ప్రణాళిక చేసుకోగలరు. రోగులతో పాటుగా కేర్ గివర్స్‌కు సైతం మద్దతు వేదికగా మై కిడ్నీ జర్నీ తోడ్పడుతుందని ఆశిస్తున్నాము’’ అని అన్నారు. మై కిడ్నీ జర్నీ ఏపీఏసీ ప్రస్తుతం 12 దేశాలలో 9 విభిన్నమైన భాషలలో ఏపీఏసీ వ్యాప్తంగా లభ్యమవుతుంది.