Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: విఇ కమర్షియల్స్ వెహికల్స్ లిమిటెడ్‌లో భాగమైన ఐషర్ ట్రక్స్ అండ్ బసెస్ నేడు 315వ వాహనాన్ని కెఎన్ఆర్ కన్స్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్‌కు పంపిణీ ప్రక్రియను పూర్తి చేసింది. మౌలిక సదుపాయాలను కల్పించే హైదరాబాద్‌కు చెందిన కంపెనీ నుంచి 130 వాహనాల భారీ ఆర్డర్ సంస్థ అందుకుంది. ఈ వాహనాలను దక్షిణ భారతదేశంలో ప్రతిష్ఠిత ఎన్హెచ్ఎఐ భారీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పథకానికి వినియోగించుకునేందుకు ఈ ఆర్డరును ఇచ్చింది.
ఈ మహోన్నతమైన క్షణం గురించి విఇ కమర్షియల్స్ వెహికల్ హెచ్డి ట్రక్స్ బిజినెస్ హెచ్డి ట్రక్స్ బిజినెస్ సీనియరు ఉపాధ్యక్షుడు గగన్‌దీప్ సింగ్ గంధోక్ మాట్లాడుతూ, ‘‘కెఎన్ఆర్ కన్స్‌స్ట్రక్షన్ లిమిటెడ్‌తో మా భాగస్వామ్యం 5 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ అల్పావధిలోనే మేము సంయుక్తంగా 315 బిఎన్VI వాహనాలను వారి వివిధ మౌలిక సదుపాయాల పథకాలకు అందించేందుకు కలిసి పని చేశాము. ఐషర్ వాహనాలపై వారి నమ్మకం, విశ్వాసం మాకు విఇ కమర్షియల్ వెహికల్స్‌లో చక్కని సంతోషాన్ని అందించింది’’ అని పేర్కొన్నారు.
‘‘ఈ ఆర్డర్ మా సదృఢమైన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోకు మరింత సాక్షిగా నిలువనుంది, అందులోని మౌలిక సదుపాయల వలయాలనికి నప్పినట్లు చేసిన ఉత్పత్తులకు చక్కని గుర్తింపు ఉంది. ఉదాహరణకు పరిశ్రమలో అగ్రగామి ప్రో సిరీస్ టిప్పర్లు మా పోటీతో కూడిన, ఉత్పత్తుల సామర్థ్యం, సామర్థ్యాలకు సాక్ష్యంగా నిలువగా, ఉన్నత స్థాయిలో ఉత్పాదకతను అందిస్తాయి. మా ఈ భాగస్వామ్యం మా అడుగుజాడలను మరింత విస్తరించేందుకు సహకరిస్తుందని విశ్వసిస్తున్నాము’’ అని ధీమా వ్యక్తం చేశారు.
కెఎన్ఆర్సిఎల్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ కె.నరసింహారెడ్డి మాట్లాడుతూ, ‘‘మా 1000+ టిప్పర్ల సమూహంలో ఐషర్ 33% మేర వాటా కలిగి ఉంది అంటే, 300+ వాహనాలు ఉన్నాయి. ఐషర్ బృందం మాకు కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రతిష్ఠిత ఎత్తిపోతల పథకాల్లో చక్కగా మద్ధతు ఇచ్చాయి. ఈ విశ్వాసాన్ని కొనసాగింపుగా మేము విఇ కమర్షియల్స్ వెహికల్స్‌తో మళ్లీ భాగస్వామ్యాన్ని పొందేందుకు చాలా సంతోషిస్తున్నాము. 130+ ఐషర్ టిప్పర్లను తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో కొత్త రహదారులను నిర్మించే మా పథకాల్లో చేర్చుకున్నాము. ఈ పథకాలు దక్షిణ భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉత్తేజాన్ని అందించనున్నాయి. మా భాగస్వాములైన విఇసివి వారి శక్తితో మేము ఈ పథకాలను సకాలంలో పూర్తి చేసే విశ్వాసాన్ని కలిగి ఉన్నాము’’ అని వివరించారు.
దీనితో, ఇద్దరు భాగస్వాములు వోల్వో ట్రక్స్ (విఇసివి నుంచి ప్రత్యేకంగా పంపిణీ, సేవలు అందించే) సైట్ సపోర్ట్ మోడల్, అంది సంపూర్ణంగా కెఎన్ఆర్ కన్స్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్‌ను నిర్వహణ అడ్డంకుల నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చింది. ఐషర్‌లో వృత్తినిపుణుల ఆన్ సైట్ బృందం ఉపకరణాలు, విడిభాగాలు, ఉపకరణాలతో సిద్ధంగా ఉంటూ, టిప్పర్ల అప్‌టైమ్ అందించడమే కాకుండా అవసరమైన అన్ని నిర్వహణలు అలాగే బ్రేక్‌డౌన్ మరమ్మతులను చేస్తారు. అన్ని కొత్త బిఎస్VI అనుసరణ ఐషర్ ట్రక్కులు, బస్సులు అత్యాధునికి టెలిమ్యాటిక్స్తో అనుసంధానం కలిగి ఉండగా, భారతదేశంలో మొట్టమొదటిసారిగా అప్‌టైమ్ సెంటర్ రియల్ టైమ్‌లో ప్రతి వాహనం పనితీరును గమనిస్తుంది.
ఐషర్ హెవి డ్యూటీ నిర్మాణ రంగానికి సంబంధించిన అవసరాలను సరైన ట్రక్కుల విస్తృత శ్రేణిని కలిగి ఉంది. 6028టిను ముందుగా సిద్ధం చేసిన ప్రో 6000 ప్లాట్‌ఫారంపై నిర్మిస్తున్నారు. ఐషర్ అత్యాధునిక ఆవిష్కార బిఎస్VI పరివారంలో అభివృద్ధి చేసిన యూటెక్ 6, సదృఢం అలాగే విశ్వసనీయమైన విడిఎక్స్8 ఇంజిన్లతో తయారు ఉండే ప్రో 6028టి టిప్పర్ల శక్తియుత 260హెచ్‌పి@2200 ఆర్పిఎంలో మరియు గరిష్ఠ టార్క్ 1000 ఎన్ఎం@1000-1700 ఆర్పిఎంలో అందిస్తుంది. ఈ శ్రేణిలో అత్యుత్తమ పవర్ టు వెయిట్ మరియు టార్క్ టు వెయిట్ నిష్పత్తులు, ఉన్నత గ్రేడబిలిటీ కలిగిన ఈ టిప్పర్లను కఠినమైన అలాగే సవాళ్లతో కూడిన వినియోగంలో పని చేసేలా డిజైన్ చేశారు. ఫ్యూయల్ కోచింగ్, ఐడిఐఎస్ (ఇంటెలిజెంట్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టం), క్రూయిస్ కంట్రోల్ ఉన్నత ఉత్పాదకతకు మరింత మద్ధతు ఇస్తాయి మరియు ఎక్కువ ఇంధన పొదుపును అందిస్తాయి, దీనితో వినియోగదారుల వ్యాపారానికి విలువను చేర్చుతాయి.