Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అట్లాంటిక్ తమ హీటింగ్ సొల్యూషన్స్ పోర్ట్‌ఫోలియో ప్రవేశం
- రూ.1890/- లకే లభ్యం
- దేశ వ్యాప్తంగా ఐదు వేరియంట్లలో రూమ్ హీటర్లు
న్యూఢిల్లీ: హింద్‌వేర్ అట్లాంటిక్ నేడు తాము పూర్తి సరికొత్త శ్రేణితో రూమ్ హీటర్ విభాగంలో ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆవిష్కరణతో, ఈ కంపెనీ ఇప్పుడు వినియోగదారులకు విస్తృత శ్రేణిలో రూమ్ హీటర్లను ఇంటి కోసం అందుబాటులో ఉంచింది. ఈ నూతనంగా విడుదల చేసిన ఉత్పత్తులు ఐదు వేరియంట్లలో వస్తాయి. అవి ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్లు, హీట్ కన్వెక్టర్లు, హాలోజెన్ క్వార్ట్జ్, ఎల్పీజీ+ ఎలక్ట్రిక్ హీటర్లు ఉన్నాయి. ఈ శ్రేణి దేశవ్యాప్తంగా పలు ఎలక్ట్రికల్ స్టోర్లతో పాటుగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈ–కామర్స్ వెబ్సైట్ల వద్ద రూ.1890/- నుంచి రూ.15,990 /- లవరకు లభ్యమవుతాయి.
ఈ విభాగంలో హింద్‌వేర్ అట్లాంటిక్ ప్రవేశించడం గురించి రాకేష్ కౌల్, సీఈవో అండ్ హోల్ టైమ్ డైరెక్టర్, సోమానీ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ (ఎస్‌హెచ్‌ఐఎల్) మాట్లాడుతూ ‘‘వినియోగదారుల అవసరాలను తీర్చాలనే మా నిబద్ధత మమ్మల్ని స్ధిరంగా ఆవిష్కరించేందుకు ప్రోత్సహిస్తుంటుంది. అంతరాలను పూరించే వినియోగదారుల లక్ష్యిత ఉత్పత్తులను పరిచయం చేసేందుకు సైతం తోడ్పడుతుంది. మా శ్రేణి రూమ్ హీటర్లను విస్తృత శ్రేణి మార్కెట్ పరిశోధన, ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌ను అర్థం చేసుకోవడం ఆధారంగా రూపకల్పనచేసి అభివృద్ధి చేయడం జరిగింది. రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో గణనీయమైన మార్కెట్ వాటాను పొందగలమని భావిస్తున్నాము’’ అని అన్నారు.