Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సీఐఐ, ఏఐసీటీఈ, ఏఐయు, ట్యాగ్డ్, సన్‌స్టోన్ ఎడ్యువర్శిటీ, యుఎన్‌డీపీ సహకారంతో వీబాక్స్ తమ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ (ఐఎస్ఆర్) 2022 ను విడుదల చేసింది. ప్రతిభావంతుల కోసం డిమాండ్, సరఫరా నడుమ ఉన్న అంతరాలను ఈ నివేదిక వెల్లడిస్తుంది. ఐఎస్ఆర్ 2022ప్రకారం మొత్తంమ్మీద 46.2% మంది యువత గత సంవత్సరం ఉపాధి సామర్థ్యం అయిన 45.97%తో పోలిస్తే మరింత మెరుగ్గా ఉపాధి సామర్థ్యం కలిగి ఉన్నారు. మహిళల్లో సైతం ఉద్యోగార్హులు సంఖ్య పరంగా స్థిరంగా వృద్ధి కనిపిస్తుంది. ఇది 51.44%గా ఉండగా, పురుషులలో 45.97% మంది ఉద్యోగార్హులుగా ఉన్నారు. ఇక నెమ్మదిగా వృద్ధి చెందుతున్న మరో ధోరణిలో 88.6% మంది గ్రాడ్యేయేట్లు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కోరుకుంటున్నారు.
ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ రాష్ట్రాలలో అభ్యర్థులు అత్యధికంగా ఉపాధి అవకాశాలను పొందగల నేర్పు కలిగి ఉన్నారు. గత సంవత్సరం మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, కర్నాటకలలో ఇది ఎక్కువగా కనిపించింది. వీరిలోనూ బీటెక్, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు ఉపాధి అవకాశాలను పొందగల నైపుణ్యం సంతరించుకుంటున్నారు. పూణె, లక్నో, త్రివేండ్రంలలో ఉద్యోగార్హత కలిగిన ప్రతిభావంతులు ఎక్కువగా ఉండగా గ్రాడ్యుయేట్లు పనిచేయాలని కోరుకుంటున్న నగరాలలో బెంగళూరు, కొచ్చి, చెన్నై నిలిచాయి. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్‌లలో యువ ప్రతిభావంతులకు అవకాశాలు లభిస్తున్నాయి.
వీబాక్స్ ఫౌండర్ అండ్ సీఈఓ నిర్మల్ సింగ్ మాట్లాడుతూ ‘‘మహమ్మారి మనకు రిమోట్ అభ్యాసం, రిమోట్ వర్క్ వంటివి పరిచయం చేయడంతో పాటుగా ఐటీ, బిజనెస్ కన్సల్టెన్సీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లలో ఇవి సాధారణతగా మార్చింది. మరీ ముఖ్యంగా విద్యా రంగం దీనికి నేతృత్వం వహిస్తుంది’’ అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘గత కొద్ది సంవత్సరాలుగా నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌లో క్రిటికల్ థింకింగ్, న్యూమరికల్ ఎబిలిటీ రంగాల్లో అపార ప్రతభ కనబరుస్తున్న విద్యార్థులు సీనియన్ ఎనలిస్ట్ , బిగ్ డాటా ఇంజినీరింగ్ బాధ్యతలలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటుగా మెరుగైన అవకాశాలను పొందుతున్నారు. అందువల్ల, ఉద్యోగార్హత నైపుణ్యాలనేవి విద్యార్ధుల ఉద్యోగ విజయానికి నడుమ ప్రత్యక్ష సంబంధం కలిగిఉంది’’ అని అన్నారు.
అర్హత కలిగిన నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ ఐటీ/ఐటీఈఎస్, ఫార్మాస్యూటికల్, ఈ–కామర్స్ మరియు బీఎఫ్ఎస్ఐలో కనిపిస్తుంది. ఈ రంగాలలో హైరింగ్ అనేది 2021తో పోలిస్తే ఫ్రెషర్స్ కోసం 2022లో 20%కు పైగా వృద్ధి చెందే అవకాశాలున్నాయి. సాంకేతిక అనేది ఓ నైపుణ్యంగా పలు పరిశ్రమల వ్యాప్తంగా డిమాండ్ కలిగి ఉండవచ్చు. ఇంటర్నెట్వ్యాపారంలో అత్యధికంగా ఉద్యోగులను ఇండియా నియమించుకోనుంది. ఆ తరువాత సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఐటీ, ఫార్మా, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో ఈ నియామకాలు ఉండనున్నాయి. అదనంగా భారతదేశ వ్యాప్తంగా కంపెనీలు 2022లో 35.96% నూతన ఉద్యోగులను నియమించుకోవచ్చని అంచనా. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం గత సంవత్సరం నుంచి గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. 2022లో డిమాండ్ అంచనాల నడుమ సానుకూలంగా 35.96% నియామకాలను అంచనా వేస్తున్నారు.
ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం బీటెక్, ఎంబీఏ కోర్సుల విద్యార్థులకు 2022లో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ కోర్సులో 55.15% మందికి ఉద్యోగార్హత ప్రతిభ ఉంటే, అనుసరించి ఎంబీఏలో 55.09% మంది ఉద్యోగార్హత కలిగి ఉంటారు. ఇంజినీరింగ్ కోర్సులో ఐటీ, సీఎస్ఈ, ఈసీఈ విభాగాలలో అధిక శాతం విద్యార్థులకు అవకాశాలు ఉండవచ్చు.
అధిక అర్హతలు కలిగిన మహిళా వనరులపై ఆధారపడటం
గత సంవత్సరం ఉద్యోగులలో మహిళల భాగస్వామ్యం 36%గా ఉంటే, ఈ సంవత్సరం అదే తరహా భాగస్వామ్యం 32.8%గా ఉండటంతో పాటుగా పలు పరిశ్రమల వ్యాప్తంగా మహిళలను నియమించుకోవడం పెరుగుతుంది. అత్యధిక శాతం ఉద్యోగాలు పొందిన నిపుణులలో 67.2% పురుషులు ఉన్నప్పటికీ మహిళలను తమ కంపెనీలలో తీసుకోవడానికి ఆయా సంస్థలు ఆసక్తి చూపడంతో పాటుగా మరింత మంది మహిళలను ఉద్యోగాలలో నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
దేశంలో అత్యధికంగా తెలంగాణాలో 39.42% మంది మహిళలు ఉద్యోగార్హతలు కలిగిన మహిళలు ఉంటే అనుసరించి కర్నాటక రాష్ట్రంలో 35.44% ఉన్నారు. ఇంటర్నెట్ వ్యాపార విభాగంలో అత్యధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు. ఈ రంగంలో 54.5% మంది మహిళలు పాల్గొంటున్నారు. పురుషులు అత్యధికంగా రియల్ ఎస్టేట్ రంగంలో కనిపిస్తున్నారు. ఈ రంగంలో దాదాపు 95% పురుషులే ఉన్నారు. దీనిని అనుసరించి తయారీ రంగంలో 88% మంది పురుషులు ఉన్నారు. ఆ తరువాత ఆటోమోటివ్ రంగంలో 80% మంది పురుషులు ఉన్నారు. ఐటీ మరియు టెక్ వ్యాపారాలలో మహిళా వర్కర్లు 52.67%గా ఉంటారని అంచనా. దీనిని అనుసరించి ఫార్మాస్యూటికల్స్ రంగంలో 35% మంది మహిళలు ఉన్నారు. ఆ తరువాత బీఎఫ్ఎస్ఐ రంగంలో 30 % మహిళలు ఉన్నారు. రిమోట్ వర్క్ అవకాశాలు పెరగడం, హైబ్రిడ్ నమూనాలు జోడించబడటం వల్ల మరింతగా పంపిణీ వర్క్‌ఫోర్స్‌ను ఎన్నో పరిశ్రమలలో చూడవచ్చని అంచనా.
ఇండియా స్కిల్ రిపోర్ట్‌ను భారతదేశ వ్యాప్తంగా 3 లక్షల మంది అభ్యర్థులను పరిశీలించి రూపొందించడం జరిగింది. వీరంతా కూడా వీబాక్స్ నేషనల్ ఎంప్లాయిబిలిటీ టెస్ట్ (డబ్ల్యుఎన్ఈటీ)లో పాల్గొన్నారు. వీరితో పాటుగా 15 కు పరిశ్రమలకు చెందిన 150 కార్పోరేట్ కంపెనీలు సైతం ఇండియా హైరింగ్ ఇంటెంట్ సర్వే– ఎర్లీ కెరీర్ ఎడిషన్‌లో పాల్గొన్నారు. వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ (డబ్ల్యుఎన్ఈటీ) సర్వే, భారతదేశంలో యువత ఉద్యోగార్హతలపై ఓ అంచనాను అందిస్తుంది. ఈ అధ్యయనంలో పరిశీలించిన అతి కీలకమైన అంశాలలో బిజినెస్ కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, న్యూమరికల్ రీజనింగ్ ఉన్నాయి.