Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతదేశపు ప్రీమియర్ కమ్యూనికేషన్ సొల్యూషన్స్ ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ (“Airtel”) నేడు ఇన్వెస్ట్ ఇండియా భాగస్వామ్యంతో ‘ఎయిర్టెల్ ఇండియా స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ‘స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’లో భాగంగా, దిగేవ పేర్కొన్న రంగాల్లో విభిన్న పరిష్కరణలను ప్రదర్శించేందుకు ప్రారంభ దశ సాంకేతిక కంపెనీలను ఆహ్వానిస్తోంది-
· 5జి - వినూత్నమైన బి2సి (B2C) లేదా బి2బి(B2B) వినియోగానికి సంబంధించిన కేసులు, అప్లికేషన్లు అధిక వేగం మరియు తక్కువ జాప్యంతో 5జి సాంకేతికతను వినియోగించుకుంటాయి.
· ఐఓటి- ఎంటర్ప్రైజెస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రయాణాన్ని శక్తివంతం చేసే వినూత్న ఐఓటి పరిష్కరణలను రూపొందించడం.
· క్లౌడ్ కమ్యూనికేషన్ – కస్టమర్ ఎంగేజ్మెంట్ అనుభవాన్ని మెరుగుపరచగల B2C లేదా B2B ఉత్పత్తులను రూపొందించేందుకు ఏఐ (AI) మరియు ఎంఎల్ (ML)సాంకేతికతలను ఉపయోగించడం.
· డిజిటల్ అడ్వర్టైజింగ్- వినూత్నమైన, ప్రత్యేకమైన ప్రకటన ఫార్మాట్లను సృష్టించడం- డిజిటల్ ఇతరత్రా రెండూ కూడా ప్రకటనలు లేదా బ్రాండ్ ప్రమోషన్లను వినియోగించుకునే వినియోగదారునికి సుసంపన్నమైన అనుభవాన్ని అందిస్తాయి.
· డిజిటల్ ఎంటర్టైన్మెంట్ – భారతదేశపు కంటెంట్ సృష్టికర్త ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడే ఒక ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించడం లేదా సంగీతం, వీడియో లేదా గేమింగ్‌లో అంతరాయం కలిగించని పరిష్కరణలను అందించడం.
దరఖాస్తులను 24 జనవరి 2022లోగా పంపుకోవాలి. ఫలితాలను 14 ఫిబ్రవరి 2022న ప్రకటిస్తారు. ఎయిర్టెల్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గురించి మరిన్ని వివరాలకు-
టాప్ 10 విజేతలు నగదు బహుమతులను గెలుచుకుంటారు, ఎయిర్టెల్ ఇన్నోవేషన్ ల్యాబ్‌కు యాక్సెస్ పొందుతారు. వారి వినియోగ కేసులను స్కేల్ చేసేందుకు అలాగే ఎయిర్టెల్ ఇంజినీరింగ్ బృందాలతో సహ-ఆవిష్కరణలకు కూడా ఎయిర్టెల్ అధునాతన సాంకేతిక మౌలిక సదుపాయాలను వినియోగించుకునేందుకు అవకాశం దక్కించుకుంటారు. ఎంపికైన 10 స్టార్టప్‌లలో ఎంపిక చేసిన కొన్నింటిని ఎయిర్టెల్ స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లో ఆన్-బోర్డ్ చేసేందుకు ఆఫర్ చేయబడుతుంది మరియు వారి కంపెనీని ఎయిర్టెల్ హైపర్-స్కేల్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా, స్టార్టప్‌లు ఎయిర్టెల్ ప్రధాన ప్లాట్‌ఫారమ్ డేటా, పంపిణీ, నెట్వర్క్ మరియు చెల్లింపులకు యాక్సెస్‌ను పొందుతాయి. ఇంకా, స్టార్టప్‌లు ఎయిర్టెల్ గ్లోబల్ పార్టనర్ ఎకోసిస్టమ్, ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ టీమ్ నుంచి అడ్వైజరీకి యాక్సెస్‌ను పొందుతాయి.
ఈ సందర్భంగా భారతీ ఎయిర్టెల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆదర్శ్ నాయర్ మాట్లాడుతూ, ‘‘భారతదేశపు స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విజయగాథ, మా యువ సాంకేతిక సంస్థలు క్లిష్ట సమస్యలను పరిష్కరించే పరిష్కరణలను రూపొందించడంలో కొన్ని అద్భుతమైన పనులు చేస్తున్నాయి. ఈ ఎమర్జింగ్ డిజిటల్ ఎకోసిస్టమ్‌కు ప్రధాన సహాయకునిగా, ఎయిర్టెల్ ప్రారంభ దశ కంపెనీలు తమ వృద్ధి ప్రయాణాలను నావిగేట్ చేయడంలో, త్వరగా, స్థిరంగా స్కేల్ చేయడంలో సహాయపడేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఎయిర్టెల్ తరపున, ఈ ఛాలెంజ్‌లో భాగం కావాలని, ఎయిర్‌టెల్‌కు చెందిన లోతైన సాంకేతిక సామర్థ్యాల నుంచి ప్రయోజనం పొందాలని నేను కంపెనీలను ఆహ్వానిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
‘‘భారతీ ఎయిర్టెల్ భాగస్వామ్యంతో స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ద్వారా భారతదేశపు యువ సాంకేతిక స్టార్టప్‌లను ప్రారంభించేందుకు మేము ఎదురుచూస్తున్నాము’’ అని ఇన్వెస్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ దీపక్ బాగ్లా తెలిపారు. భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ప్రపంచంలో మూడవ అతిపెద్దది, ఈ సవాలు ద్వారా, వృద్ధి చెందుతున్న స్టార్టప్‌లు సంక్లిష్ట ప్రపంచ సమస్యలకు మేడ్-ఇన్-ఇండియా పరిష్కరణలు ప్రదర్శించగలవని మేము విశ్వసిస్తున్నాము. ఇన్వెస్ట్ ఇండియా తరపున, ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవలసిందిగా ప్రారంభ దశ కంపెనీలను నేను ఆహ్వానిస్తున్నాను’’ అని పిలుపునిచ్చారు.