Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంతపురం: భారతదేశంలో ప్రతి ఇంటిలో వినిపించే పేరు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లామినేట్ బ్రాండ్, గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో మొట్టమొదటి ప్రత్యేకమైన గ్రీన్‌లామ్ డిస్ప్లే సెంటర్‌ను ప్రారంభించింది. నివాస, వాణిజ్య స్థలాల కోసం విస్తృతమైన, విభిన్న రకాల లామినేట్లను ఈ బ్రాండ్ అందిస్తోంది. నంది టింబర్ డిపో, వేణుగోపాల్ నగర్, గుత్తి రోడ్డులో 30 అడుగుల*20 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన డిస్ప్లే సెంటర్ కొత్త, ప్రత్యేకమైన డిజైన్లు, స్టైల్లు, ప్యాటర్న్లతో అత్యున్నత నాణ్యత కొలమానాలతో, సాటిలేని విలువ మరియు అప్పీల్‌ను కలిగి ఉంది.
గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రీమియం గ్రేడ్ సర్ఫేసింగ్ సొల్యూషన్లను అందిస్తామని హామీ ఇస్తోంది. బ్రాండ్ అత్యుత్తమమైన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ టాప్-షెల్ఫ్ క్రాఫ్ట్మెన్షిప్ను ప్రదర్శిస్తుంది. ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, గృహయజమానులకు ఇష్టమైనది, ఎవరైనా ప్రీమియం సొల్యూషన్స్ కోసం చూస్తున్నట్లయితే, గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ మీకు చక్కని పరిష్కరాన్ని చూపిస్తుంది. ఇప్పటికే 100 కన్నా ఎక్కువ దేశాలలో విస్తరించిన గ్రీన్‌లామ్, ఆవిష్కరణలపై ఉన్న చక్కని అభిరుచితో నాణ్యమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది.
రాపిడి నిరోధకత, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, హీట్ రెసిస్టెంట్ వంటి ఇతర నాణ్యమైన లక్షణాలతో సహా అసాధారణమైన లక్షణాలను గ్రీన్‌లామ్ లామినేట్లు ప్రదర్శిస్తాయి. ఈ లామినేట్లు అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా రోజువారీ ప్రయోజనం కోసం ఫంక్షనల్, అద్భుతమైన డిజైన్లను అందిస్తాయి. వారు చక్కగా రూపొందించిన ఎంపికలతో సున్నితమైన వర్ణాల్లో అందుబాటులో ఉండగా, తద్వారా వాటిని ప్రపంచంలోని టాప్ 3 లామినేట్ తయారీదారులలో ఒకరిగా మంచి కారణాల కోసం నిలబెట్టారు.
లామినేట్ వ్యాపారంలో అగ్రగామిగా నిలిచిన గ్రీన్‌లామ్, విస్తృతమైన రంగులు, నమూనాలు, టెక్చర్స్‌ను ప్రదర్శిస్తుంది. ప్రదర్శన కేంద్రాన్ని నంది శివ కుమార్ (శ్రీ నంది టింబర్ డిపో), శ్రీనివాస చక్రవర్తి చుండూరు (రీజినల్ హెడ్ ఏపీ & తెలంగాణ – గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్), దేవేష్ దాస్ (సెగ్మెంట్ హెడ్ ట్రేడ్ – గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్), ఖలీల్ షేక్ (బ్రాంచ్ హెడ్ – గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) సమక్షంలో పి.శేషాంజనేయులు (జిల్లా వాణిజ్య పరిశ్రమల శాఖ అధ్యక్షుడు), పి.గురు ప్రసాద్ బిఎ, బిఎల్ (అడ్వకేట్) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, కాంట్రాక్టర్లు మరియు డీలర్లు కూడా పాల్గొన్నారు.
డిస్ప్లే సెంటర్ ప్రారంభం గురించి గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లామినేట్స్ అండ్ అలైడ్ సెగ్మెంట్ రీజనల్ హెడ్ శ్రీనివాస చక్రవర్తి చుండూరు మాట్లాడుతూ, “మా మొదటి ప్రత్యేక కేంద్రం ప్రారంభంతో అనంతపురం నగర ప్రజలకు గ్రీన్‌లామ్ రిటైల్ అనుభవాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. డిస్ప్లే సెంటర్ ద్వారా వినియోగదారులు ఒకే పైకప్పు క్రింద పలు రకాల లామినేట్లను తాకేందుకు మరియు అనుభూతి చెందడానికి అనుమతిస్తూ, కొనుగోలు ప్రక్రియ సౌకర్యవంతంగా, అంతరాయం లేకుండా లేకుండా చేస్తుంది’’ అని వివరించారు.