Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ అయిన లానెక్సెస్ శీతోష్ణస్థితి మార్పులకు సంబంధించి తాను చేస్తున్న పోరాటంలో సాధించిన విజయాలకు మరో సా రి గుర్తింపును పొందింది. ప్రఖ్యాత శీతోష్ణస్థితి పరిరక్షణ కార్యక్రమం సీడీపీ చేసిన తాజా మదింపులో, ఈ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 200 కంపెనీలతో ఉన్న ‘క్లైమేట్ ‘ఎ’ లిస్ట్’ లో చేర్చబడింది. 12,000కు పైగా మదింపు వేయబడిన అన్ని కంపెనీల్లో గ్రూప్ మొదటి 2 శాతంలో ఉంది. ‘ఎ’ రేటింగ్ అనేది మరింత ముఖ్యంగా శీతోష్ణస్థితి రక్షణ కార్యకలాపాల్లో పారదర్శకత, స మగ్రత వెల్లడికి మరియు సంబంధిత ప్రాజెక్టుల అమలుకు ఇచ్చేది. వరుసగా ఐదో ఏ డాది కూడా లానెక్సెస్ ‘క్లైమేట్ ‘ఎ’ లిస్ట్’ లో చేర్చబడింది. ఈ గ్రూప్ సీడీపీకి 2012 నుంచి కూడా తన క్లైమేట్ ప్రొటెషన్ సంబంధిత డేటాను వెల్లడిస్తోంది.
ఈ సందర్భంగా లానెక్సెస్ ఏజీ మేనేజ్ మెంట్ బోర్డు సభ్యులు హుబర్ట్ ఫింక్ మాట్లా డుతూ, ‘‘లానెక్సెస్ లో క్లైమేట్ ప్రొటెక్షన్ అనేది కార్పొరెట్ వ్యూహంలో కేంద్రబిందువుగా ఉంటుంది. ఇది 2040 నాటికి క్లైమేట్ న్యూట్రల్ కావాలన్నమా ఆశయాన్ని సాధించేం దుకు మేం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఫలిస్తుంది. ఈ రంగంలో మా ఆశయాలను సీడీపీ అవార్డు చాటిచెబుతుంది’’ అని అన్నారు. దీనికి తోడుగా లానెక్సెస్ నీటి నిర్వహణ రంగంలో బి రేటింగ్ ను పొందింది. గత ఏడాది కంపెనీ సుస్థిరదాయక నీటి నిర్వహణ లక్ష్యాలను నిర్దేశించుకుంది. అత్యధికంగా నీటి ఒత్తిళ్లను ఎదుర్కొనే నాలుగు సైట్స్ లో స్థానికంగా నీటి నిర్వహణను సుస్థిరదాయకం చేసేలా ప్రాజెక్టులను ప్రారంభించింది.
వరుసగా ఎన్నో గుర్తింపులు
సీడీపీ ‘క్లైమేట్ ఎ లిస్ట్’ లో మరోసారి చేర్చబడడం అనేది ఈ ఏడాది సుస్థిరదాయక రే టింగ్స్ లో తీసుకున్న ఎన్నో సానుకూల మదింపుల కారణంగా చోటు చేసుకుంది. న వంబర్ లో లానెక్సెస్ మరోసారి డవ్ జోన్స్ సస్టెయినబిలిటీ ఇండెక్సెస్ (డీజేఎస్ఐ) వరల్డ్, యూరప్ లలో చేర్చబడింది. గత ఏడాది ఈ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ డీజే ఎస్ఐ యూరప్ లో ‘కెమికల్స్’ విభాగంలో అగ్రస్థానంలో ఉంది మరియు డీజేఎస్ఐ వరల్డ్ లో రెండో స్థానంలో నిలిచింది. జూన్ లో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ MSCI ESG సస్టెయినబిలిటీ ఇండెక్స్ లో కూడా తన రేటింగ్ ను A నుంచి A Aకు మెరుగుపర్చుకుంది. ఇక్కడ గమనించాల్సిన ము ఖ్యాంశాలు ఏమిటంటే, కంపెనీ యొక్క నీటి నిర్వహణ మెరుగుపడడం, క్లైమేట్ పై చక్కటి వ్యూహం, రసాయన సురక్షితకు కట్టుబాటు. లానెక్సెస్ తన ఎకోవాడిస్ సస్టె యినబిలిటీ రేటింగ్ ను ప్లాటినం స్థాయికి మెరుగుపర్చుకుంది. ఈ అవార్డు ఎకోవాడిస్ విశ్లేషించే 75,000 కంపెనీల్లో టాప్ 1 శాతం కంపెనీలకు ఇవ్వబడుతుంది. ఈ అధిక రేటింగ్ కు సుస్థిరదాయక అంశాల్లో మెరగుదల అనేది చోదకశక్తిగా ఉంది.
సీడీపీ: పర్యావరణ డేటాలో అత్యధిక పారదర్శకత
సీడీపీ అనేది ఒక స్వతంత్ర లాభాపేక్ష రహిత సంస్థ. గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలపై అం తర్జాతీయ పారదర్శకతను సృష్టించడాన్ని, అడవులు, జలవనరుల నిర్వహణను లక్ష్యంగా చేసుకంది. 2021లో 12,000కు పైగా కంపెనీలు తమ డేటాను సమర్పించా యి. పర్యావరణ సంబంధిత సమాచారానికి సంబంధించి ఇది సీడీపీ డేటా ప్లాట్ ఫామ్ ను ప్రపంచపు అత్యంత సమగ్ర వనరుగా మార్చింది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 590 కి పైగా ఇన్వెస్టర్లచే సపోర్ట్ చేయబడుతోంది. 110 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆస్తులను ఈ కంపెనీలు నిర్వహిస్తున్నాయి.