Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రూమ్ హీటర్ విభాగంలో ప్రవేశిస్తున్నట్లు హింద్వేర్ అట్లాంటిక్ వెల్లడించింది. ఇందులో కొత్తగా ఐదు వేరియంట్లలో హీటర్లను విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్లు, హీట్ కన్వెక్టర్లు, హాలోజెన్ క్వార్ట్జ్, ఎల్పిజి ఎలక్ట్రిక్ హీటర్లు ఉన్నాయి. ఈ ఉత్పత్తుల ధరల శ్రేణీ రూ.1890 నుంచి రూ.15,990గా ఉంది. దేశవ్యాప్తంగా పలు ఎలక్ట్రికల్ స్టోర్లతో పాటుగా ఆన్లైన్ సైట్లలోనూ లభ్యమవుతాయని హింద్వేర్ అట్లాంటిక్ సిఇఒ రాకేష్ కౌల్ పేర్కొన్నారు.