Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుర్గండి హురున్ జాబితాలో 29 కంపెనీలకు చోటు
హైదరాబాద్ : తెలంగాణలోని దాదాపు 29 అతిపెద్ద కంపెనీల విలువ రూ.6.9 లక్షల కోట్లుగా ఉందని బుర్గుండి ప్రయివేటు హురున్ ఇండియా రిపోర్ట్‌లో వెల్లడించింది. యాక్సిస్ బ్యాంక్, బుర్గుండి ప్రయివేటు, హురున్ ఇండియా సంయుక్తంగా 2021 బుర్గుండి ప్రయివేటు హురున్ ఇండియా 500 మొదటి ఎడిషన్‌ను విడుదల చేశాయి. ఇందులో దేశంలోని 500 అత్యంత విలువైన కంపెనీల జాబితా. లిస్టెడ్ కంపెనీలకు వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా, నాన్ లిస్టెడ్ కంపెనీలకు వాల్యూయేషన్స్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చాయి. తెలంగాణ నుంచి దివీస్ లాబరేటరీస్ రూ.1.36 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో హిందుస్థాన్ జింక్ రూ.1.31 లక్షల కోట్లు, రెడ్డీస్ లాబరేటరీస్ రూ.77,540 కోట్ల చొప్పున విలువ కలిగి ఉన్నాయి. జాబితాలోని తెలంగాణ కంపెనీల మొత్తం విక్రయాల సంకలిత విలువ ఏడాదికి రూ. 1.8 లక్షల కోట్లు గా ఉందని.. అది రాష్ట్ర జిఎస్టిపిలో 18 శాతానికి సమానమని ఈ రిపోర్ట్ తెలిపింది. ''దేశంలోని టాప్ 500 కంపెనీల మొత్తం విలువ రూ.228 లక్షల కోట్లుగా ఉంది. ఇది గడిచిన ఆర్థిక సంవత్సరం జిడిపి కంటే అధికం. ఈ కంపెనీల ఏడాది ఆదాయం భారత జిడిపిలో 29 శాతానికి సమానం. ఇవి దేశంలోని మొత్తం కార్మిక సిబ్బందిలో 1.5 శాతానికి ఉపాధి కల్పిస్తున్నాయి.'' అని యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అమితాబ్ చౌదరి పేర్కొన్నారు.