Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ గత 25 ఏళ్లుగా నిర్వహిస్తోన్న వెబ్సైట్ ర్యాంకింగ్ సర్వీస్ అలెక్సా.కమ్‌ను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా పలు వెబ్సైట్లకు సెర్చ్ ఇంజన్ అప్టిమైజేషన్ (ఎస్ఇఒ), అనాలిసిస్ టూల్స్‌ను అమెజాన్ అందిస్తోంది. కాగా.. వచ్చే ఏడాది నుంచి వెబ్సైట్ల స్టాటిస్టిక్స్, వాటి ర్యాంకింగ్‌లను అందించే సర్వీసులను నిలిపివేయనున్నట్లు తెలిపింది. 2022 మే నుంచి ఈ సేవలు అందుబాటులో ఉండవని వెల్లడించింది. అయినప్పటికీ 2022 డిసెంబర్ వరకు ఆయా వెబ్సైట్ల డేటాను పొందేందుకు వినియోగదారులకు అమెజాన్ వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది.