Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీలో ఉందని ప్రభుత్వ వర్గాలు పదే పదే చెబుతుంటే మరోవైపు వాహన అమ్మకాలు మాత్రం డీలా పడ్డాయి. ప్రస్తుత ఏడాది నవంబర్లో దేశ వ్యాప్తంగా వాహన రిటైల్ అమ్మకాలు 18,17,600 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 2.7 శాతం తగ్గుదల అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎడిఎ) తెలిపింది. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ కొనసాగినప్పటికీ వాహన అమ్మకాలు పడిపోవడం ఆందోళనకరం. ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఏకంగా 19.44 శాతం క్షీణించి 2,40,234 యూనిట్లకు పరిమితమయ్యాయి. ద్విచక్ర వాహనాలు 14.44 లక్షల నుంచి 14.33 లక్షల యూనిట్లకు తగ్గాయని.. ట్రాక్టర్ల అమ్మకాలు 50,180 నుంచి 45,629 యూనిట్లకు పరిమితమయ్యాయని ఎఫ్ఎడిఎ వెల్లడించింది.