Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలి ఖాన్ పలు సంవత్సరాల అనంతరం పూర్తిగా కొత్తగా రూపొందించిన ఫ్రాంఛాయిసీ బంటి ఔర్ బబ్లి-2లో మరోసారి రాణితో కలిసి నటించారు. తమ బ్లాక్ బస్టర్ చిత్రాలైన హమ్ తుమ్ మరియు తర రం పం చిత్రాల్లో ఈ నటితో అభినయించగా, ఈ జంట ప్రతిసారీ ప్రేక్షకులను రంజిస్తూనే వచ్చింది.
సైఫ్ మాట్లాడుతూ, ‘‘రాణితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆమె సెట్లో చాలా సంతోషంగా ఉంటారు మరియు వారి శక్తి అందరికీ వ్యాపిస్తుంది. దానితో ఆమెతో కలిసి మళ్లీ పని చేయడం చాలా రోమాంఛనకారి అనుభవం, ఎందుకంటే అది రాణితో మ్యాడ్, ఫన్ రైడ్‌గా ఉంటుంది’’ అన్నారు. దీని గురించి మరింత వివరిస్తూ, ‘‘అది స్పష్టంగా నేను దేన్ని నిరీక్షించానో, అదే జరిగింది మరియు చిత్రీకరణ అద్భుతంగా ఉంది. మేము సెట్లో పరస్పరం జోక్ చేసుకుంటూ, చిన్న గలాటలతో నవ్వుకుంటూ ఉంటాము. సెట్లో ఉన్న వారంతా మమ్మల్ని నిశ్వబ్దంగా ఉండమని చెబుతూ ఉంటే, చిత్రీకరణ ప్రారంభం అయ్యే సమయానికి మళ్లీ పిల్లల్లా గొడవ చేసేవాళ్లం. మేమంతా సెట్లో పిల్లల్లా ఉన్నాము మరియు మేము కొందరం మాత్రమే ఉండేవాళ్లం’’ అని వివరించారు.
సైఫ్ మాట్లాడుతూ, ‘‘అద్భుత బాంధవ్యాన్ని కలిగిన ఇద్దరు వ్యక్తులు పలు సంవత్సరాల అనంతరం ఒక్కచోట చేరితే ఏమవుతుంది అని నేను ఆలోచించాను. జ్ఞాపకం చేసుకునేందుకు, పంచుకునేందుకు పలు శాలు ఉంటాయి మరియు చాలా ముఖ్యంగా మరోసారి ఆన్ స్ర్కీన్‌లో అత్యుత్తమమైన పని చేయాలన్న తపన ఉంటుంది’’ అని వివరించారు. సైఫ్ మరియు రాణి బాలీవుడ్లో హమ్ తుమ్ ద్వారా ప్రతి ప్రేక్షకుని వలయానికి చేరుకునే అత్యంత ప్రియమైన రొమాంటిక్ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీని గురించి మాట్లాడుతూ, ‘‘రాణి మరియు నేను పలు అద్భుతమైన సినిమాల్లో నటిచడం అదష్టం అని నేను భావిస్తాను. హమ్ తుమ్ మేము ఎన్నడూ ఊహించనటువంటి ప్రేమను ఇచ్చింది మరియు ఆ సినిమా కల్ట్ హిట్‌గా నిలిచింది. అందుకే మేము మళ్లీ ఈ సినిమా కోసం ఒక చోటుకు వచ్చినప్పుడు మంచి సినిమా ఇవ్వగలం అన్న నమ్మకం కలుగుతుంది’’ అని పేర్కొన్నారు.
‘‘ఒక మంచి సినిమా ఇచ్చుందుకు మనం ఒక బృందంగా పని చేయాలని నాకు తెలుసు. బంటి ఔర్ బబ్లి-2లో మనం చేసిన పనిని ప్రజలు ప్రశంసిస్తారు అన్న భరోసా నాకుంది, ఎందుకంటే మనకు దాన్ని చిత్రీకరించే సమయంలోనే అద్భుతమైన వినోదం ఉండడంతో, అది ప్రేక్షకులను ఎంతగా రంజిస్తుందో అర్థం అవుతుంది. మాపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు సెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నవ్వుల అలల్లో మునిగి తేలారు. దానితే మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు అని చూసేందుకు వేచి చూస్తున్నాను’’ అని తెలిపారు.