Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సింగపూర్‌కు చెందిన బయోసిమిలర్స్ కంపెనీ ప్రెస్టీజ్ బయోఫార్మా ఉత్పత్తి చేసే 'ట్రాస్తుజుమాబ్'ను లాటిన్ అమెరికా, ఆగే యాసియా దేశాల్లో విక్రయించేందుకు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం సరఫరా, మార్కెటింగ్‌ను చేపట్టనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ సీఈఓ బ్రాండెడ్ మార్కెట్స్ ఎంవి రమణ తెలిపారు. 'హెర్సిప్టన్' బ్రాండ్‌తో రోషే విక్రయిస్తున్న బయోలాజిక్ ఔషధానికి ఇది బయోసిమిలర్. ఆయా దేశాల్లో ఔషధం రిజిస్ట్రేషన్, లైసెన్స్‌లు డాక్టర్ రెడ్డీస్‌కు దక్కాయి.