Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మింత్ర తన చీరలు, లెహంగాలు, శరారాలు, ఫరారా తదితర అత్యుత్తమ డిజైన్, ఇండియన్ వేర్ ఉత్పత్తులకు చక్కని ప్రఖ్యాతి సాధించిన మీనా బజార్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించగా, ఇది దేశంలో ఇ-కామర్స్ ప్లాట్ఫారంలో ఈ తరహా భాగస్వామ్యాల్లో మొదటిది కానుంది. ఢిల్లీలో 1970లో ప్రారంభమైన మీనాబజార్ మూలత ప్రింటెండ్ చీరల చిన్న దుకాణంగా ప్రారంభమైంది. నేడు ప్రపంచ స్థాయిలో భారతీయులు గుర్తించే అగ్రగామి రిటెయిల్గా ఖ్యాతినార్జించి 45కు పైగా దేశాల్లోని వినియోగదారులకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.
మీనా బజార్ భారతదేశపు మహిళలకు సృష్టించిన ఎథినిక్ ఫ్యాషన్ ప్రపంచానికి ఆఫర్ అందిస్తుండగా, సంప్రదాయక ఎథినిక్ వేర్ సారం మరియు అధునిక సౌందర్య ప్రజ్ఞలను సంయోజించి అన్ని వయసుల మహిళలకు అందిస్తుండగా, 28-50 ఏళ్ల వారికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోంది. ఈ బ్రాండ్ రూపొందించిన సంప్రదాయక భారతీయ దుస్తులు తరతరాలుగా చేతులు మారుతూ రాగా, అత్యుత్తమ ధరల్లో విస్తృత శ్రేణి ఎంపికలను వివాహాలు, పండుగలు, శుభ, సంప్రదాయక కార్యక్రమాలు లేదా నిత్యం ధరించే దుస్తులను అందిస్తోంది. వధువులుగా మారుతున్న వారు మరియు వధువుల స్నేహితురాళ్లు కూడా వధువు దుస్తులకు వెడ్డింగ్ వేర్ ఆవిష్కరించవచ్చు, దానికి ప్రత్యేక లెహంగాలు మరియు గౌన్ల ఎంపికలూ ఉంటాయి. ఈ బ్రాండ్ ఈ వర్గంలో అత్యుత్తమ డిజైనర్ వేర్‌ను అందిస్తుంది. ఈ బ్రాండ్ రెడి-మేడ్ సూట్లు, అనార్కలీలు, శరారాలు, కుర్తీలు, లెహంగాలు మరియు గౌన్లు స్మాల్ (ఎస్) నుంచి XXXL (3ఎక్స్ఎల్) వరకు లభిస్తాయి.
దేశంలోని వివిధ భాగాలకు చెందిన 70 పైచిలుకు రిటెయిల్ స్టోర్లు మరియు అత్యుత్తమ కలెక్షన్ల నుంచి వినియోగదారులకు ఉత్పత్తులను అందిస్తున్న మీనా బజార్ అగ్రగామి ఇండియన్ వేర్ వలయంలో తనను తాను సదృఢంగా నిరూపించుకుంది. ఇది 350 ఎంపికలను కలిగి ఉండగా, ఈ బ్రాండ్ రానన్న రెండు నెలల్లో 700 ఎంపికలకు విస్తరించనుంది. మింత్రలో లభించే స్టైళ్ల సగటు ధర కుర్తీలకు రూ.2200 నంచి లాచా/లెహంగాలకు రూ.18,000 వరకు ఉన్నాయి. చీరలు రూ.7,000 సగటు ధరలో లభిస్తాయి. మింత్రతో తన సరిసాటి లేని భాగస్వామ్యంతో మీనా బజార్ 22-28 ఏండ్ల వయసు ఉన్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జెన్-జడ్ కొనుగోలుదారులు సంప్రదాయక దుస్తులను సూక్ష్మ మరియు డిజైన్ ఉత్పత్తుల ఆసక్తిని వృద్ధిచేసుకుంటుండగా, వారి నుంచి ఎక్కువ డిమాండ్ వస్తోంది.
ఫ్యాషన్ మరియు లైఫ్‌స్టైల్‌కు భారతదేశంలోని అగ్రగామి కేంద్రాల్లో ఒకటైన మింత్ర, ఇండియన్ వేర్ విభాగంలో 600 పైచిలుకు బ్రాండ్లను కలిగి ఉంది. దేశ వ్యాప్తంగా ఫ్యాషన్ ఆసక్తి ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ కేంద్రంగా, ప్రతి విభాగంలో విస్తృత శ్రేణి బ్రాండ్లను కలిగి ఉంది. మింత్రాలో ఇండియన్ వేర్ ప్రస్తుత ఉత్తమ ప్రగతి చూస్తుండగా, అది ఫ్యాషన్ ఆసక్తి ఉన్న మహిళా వినియోగదారులతో ప్రేరితమైంది. రానున్న ఇఓఆర్ఎస్ ఎడిషన్ సందర్భంలో 1.5 లక్షల స్టైళ్లలో ఇండియన్ వేర్ విభాగాన్ని దేశ వ్యాప్తంగా ఉత్తమ ధరల్లో అందిస్తుండగా, మీనా బజార్ కొత్త వినియోగదారులను సొంతం చేసుకునేందుకు మరియు వృద్ధి చెందుతున్న ఫ్యాషన్-ఆసక్తి కలిగిన తన వినియోగదారులతో క్రియాశీలతకు ఇది పరిపూర్ణమైన లాంచ్‌ప్యాడ్ కానుంది.
మీనా బజార్‌తో తన భాగస్వామ్యం గురించి మింత్ర చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శరణ్ పైస్ మాట్లాడుతూ, 'మింత్ర దేశ వ్యాప్తంగా ఫ్యాషన్-ఆసక్తి ఉన్న వినియోగదారులకు తన ఆఫర్లను విస్తరించడంలో ఎంపికల కేంద్రాలను కొనసాగించింది. తరతరాల వినియోగదారులకు సేవలు అందించిన మీనా బజార్ వంటి ఐకానిక్ బ్రాండ్న మా ప్లాట్పారానికి తీసుకు రావడం మాకు గౌరవంగా అనిపిస్తుంది. ఈ భాగస్వామ్యం మింత్రలో కొనుగోలుదారుల్లో మరియు దాని ఫ్యాషన్ ప్రపొజిషన్లో సదృఢమైన ప్రభావాన్ని సృష్టించడంలో సుదీర్ఘంగా ముందంజలోకి వస్తుండగా, మేము వివిధ ధరల అంశాల్లో వైవిధ్యమయ ఎంపికలను అందిస్తున్నాము. ఎథినిక్ వేర్ సదృఢమైన ప్రగతి అవకాశాలు ఉన్న విభాగంగా ఉంది. మేము ఈ విభాగంలో ఈ నెలలో అందుబాటులోకి నిర్వహిస్తున్న ద్వైవార్షిక కార్యక్రమం ఇఓఆర్ఎస్ నేపథ్యంలో మేము భారీ స్థాయిలో విస్తరిస్తున్నాము. మీనా బజార్‌తో అర్థవంతమైన భాగస్వామ్యాన్ని నీరీక్షిస్తున్నాము` అని తెలిపారు.
మీనా బజార్ వ్యవస్థాపకులు అను మంగ్లాని మాట్లాడుతూ, 'మింత్రతో భాగస్వామ్యం ప్రస్తుతం మా బ్రాండ్ అనుభవాన్ని పొందడం సాధ్యం కానివారికి అవకాశాన్ని కల్పిస్తుంది. అంతే కాకుండా ప్రస్తుత కాలుష్యం, ప్రయాణ సమయం మరియు ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసే సమయాన్ని ఆదాయ చేసుకునే దిశలో వినియోగదారుల అనుకూలత వృద్ధి చెందింది. ఉత్పత్తుల దృష్టికోణం నుంచి ఆఫ్‌లైన్‌లో అందుబాటులో లేని అసంఖ్యాత ఉత్పత్తులు మింత్రలో లభిస్తాయి. మేము ఈ ప్రయాణానికి అత్యంత ఉత్సుకతతో ఉన్నాము మరియు ఉజ్వల భవిష్యత్తును వేచి చూస్తున్నాము` అని తెలిపారు.