Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి. మన అందరి ప్రియమైన సరిగమప సరికొత్త సీజన్ తో మరోసారి మనముందుకు రాబోతుంది. జీ తెలుగు, సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్.. సంగీత ప్రియులను మరోసారి స్వాగతిస్తున్నది. మునపటి సంవత్సరం లో అందరి మనసులను గెలుచుకున్న ఈ పాటల వేదిక మరోసారి హృదయాల్ని గెలుచుకోవడానికి సిద్ధం అయింది.
ప్రేక్షకుల ఆనందమే తమ సంతోషంగా మార్చుకున్న జీ తెలుగు, ఎప్పుడూ తన అభిమానుల కోసం సరికొత్త షోస్ అందిస్తూ వారికి దగ్గరవుతూ ఉంటుంది. ఆ బంధాన్ని బలపరుచుకుందామని, స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్ ఆడిషన్స్ తీసుకొస్తున్నారు. మీరు 16 - 35 వయసు వారు అయితే అర్హులు. ఈ డిసెంబర్ 12న విజయనగరం, ఖమ్మంలలో, 13న నెల్లూరు, వరంగల్ లలో, 14న రాజముండ్రి, తిరుపతి, కరీంనగర్ లో ఆడిషన్స్ జరగనున్నాయి. వేదిక, సమయం విషయాలకు వస్తే..
విజయనగరం - హోటల్ వైట్ల రెసిడెన్స్, మయూరి జంక్షన్ ఏరియా, ఘడి ఖానా, బాలాజీ నగర్ డిసెంబర్ 12 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు
ఖమ్మం - బడ్జెట్ హోటల్, గాంధీ చౌక్ - గాంధీ విగ్రహం దగ్గర, రామచంద్ర నగర్ కాలనీ, మోతీ నగర్ డిసెంబర్ 12 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు
నెల్లూరు - డి ఆర్ ఉత్తమ హోటల్ గ్రాండ్, ట్రంక్ రోడ్, రమేష్ రెడ్డి నగర్, డిసెంబర్ 13 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు
వరంగల్ - హోటల్ సుప్రభా నక్కలగుట్ట, ఎన్ ఎచ్ 163, బాలసముద్రం, హనుమకొండ డిసెంబర్ 13 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు
రాజముండ్రి - ల హస్పిన్ హోటల్, పుష్కరఘాట్ రోడ్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, శేషయ్య మెట్ట డిసెంబర్ 14 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు
తిరుపతి - హోటల్ పీ ఎల్ ఆర్ గ్రాండ్, జయశ్యాం రోడ్, సెంట్రల్ బస్సు స్టాండ్ వెనుకాల, టాటా నగర్ డిసెంబర్ 14 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు
కరీంనగర్ - హోటల్ తారక, హోటల్ శ్వేతా పక్కన, రైస్ మిల్ అసోసియేషన్, బస్సు స్టాండ్ దగ్గర, మూకారంపుర డిసెంబర్ 13 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు
ఇంకా ఎందుకు ఆలస్యం, మీలో ప్రతిభ ఉండి, సంగీతం మీ నరనరాల్లో జీర్ణించుకొని ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఇదే మీకు సువర్ణావకాశం.12,13, 14 తేదీలలో సరిగమప ఆడిషన్స్