Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దక్షిణాసియాకు చెందిన ఎల్జీబీటీక్యుం చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తుండటంతో పాటుగా ఆ చిత్రాలను రూపొందిస్తున్న లోటస్ విజువల్ ప్రొడక్షన్స్ కంపెనీ హైదరాబాద్ క్వీర్ ఫిల్మ్ ఫెస్టివల్లో తమ సత్తా చాటింది. బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణా స్టూడియో ప్రివ్యూ థియేటర్లో జరిగిన ఈ ఫెస్టివల్లో మొత్తం 12 చిత్రాలను ప్రదర్శించగా, వాటిలో నాలుగు చిత్రాలు లోటస్ విజువల్ ప్రొడక్షన్స్ రూపొందించినవే కావడం విశేషం.
ఈ విషయాన్ని లోటస్ విజువల్ ప్రొడక్షన్స్ అధినేత నీరజ్ చెబుతూ 'తాము రూపొందించిన సియాక్, ఈవెనింగ్ షాడోస్, యు ఫర్ ఉషా, షీర్ ఖోర్మా లు ఈ ఫెస్ట్‌లో ప్రదర్శితమయ్యాయి. భారతదేశంలో మొట్టమొదటి సైలెంట్ ఎల్జీబీటీక్యు లవ్ స్టోరీ సియాక్. ఇది ఇప్పటి వరకూ 59 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. భారతీయ సినిమా రంగంలో ఇది ఓ మైలురాయి. ఇద్దరు క్వీర్ మెన్ నడుమ ముంబైలోని ఓ లోకల్ ట్రైన్లో చిగురించిన ప్రేమను అందంగా దీనిలో ఫరాజ్అన్సారీ చూపారు. అలాగే ఫరాజ్ అన్సారీనే రూపొందించిన మరో చిత్రం షీర్ ఖోర్మా. దీనిలో షబానా అజ్మీ, దివ్యా దత్తా, స్వర భాస్కర్ లాంటి తారలు కీలక పాత్రలలో నటించారు. జూన్ 2021లో మొట్టమొదటిసారిగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం 66 ఫిలిం ఫెస్టివల్స్‌లో పాలుపంచుకోవడంతో పాటుగా 48 అంతర్జాతీయ అవార్డులనూ గెలుచుకుంది. దక్షిణాసియా క్వీర్ సినిమాను అంతర్జాతీయంగా తీసుకువెళ్లడమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నాము` అని అన్నారు.
హైదరాబాద్ క్వీర్ ఫిల్మ్ ఫెస్టివల్లో 12 చిత్రాలను ప్రదర్శించారు. వీటిలో ఒకటి ఫీచర్ ఫిల్మ్ కాగా 11 లఘు చిత్రాలు. దాదాపు 150 మంది వరకూ ఎల్జీబీటీక్యుం సభ్యులు, మద్దతుదారులు, సానుభూతిపరులు ఈ ప్రదర్శనకు హాజరయ్యారు.