Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐరన్ డెఫిషియెన్సీ అనీమియాపై అవగాహన కల్పించేందుకు ఫేస్బుక్లో ఒక గంటలో ఎక్కువ మంది వ్యక్తులు ఒకే వాక్యాన్ని అత్యధిక సంఖ్యలో చెప్పిన వీడియోల అప్లోడ్..
హైదరాబాద్ : భారతదేశంలో ఐరన్ లోపంపై అవగాహన పెంచేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తున్న ప్రోక్టర్ అండ్ గాంబుల్ హెల్త్ లిమిటెడ్ మరియు ఎఫ్ఓజిఎస్ఐ (భారతదేశంలో ప్రసూతి మరియు గైనకాలజికల్ సంఘాల సమాఖ్య), గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో కలిసి ప్రత్యేక ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఐరన్ లోపం అనీమియాపై అవగాహన కల్పించేందుకు, వైద్యులతో సహా అత్యధిక సంఖ్యలో వ్యక్తుల చెప్పిన ఏక వాక్యపు వీడియోలను ఫేస్బుక్లో ఒక గంటలో అప్లోడ్ చేసి ఈ రికార్డు నెలకొల్పారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్ష - 4 (ఎన్ఎఫ్ హెచ్ఎస్-4)1 ప్రకారం దాదాపు 53శాతం గర్భిణిలు రక్తహీనతతో బాధపడుతుండగా, అంచనా వేయబడిన 80శాతం ప్రసూతి మరణాలకు ఇది కారణమవుతుందని, ప్రపంచవ్యాప్తంగా రక్తహీనతకు సంబంధించి అతిపెద్ద భారాన్ని మోస్తున్న దేశాలలో భారతదేశం ఒకటిగా గుర్తించారు. ఇనుప ధాతువు లోపం రక్తహీనతకు ప్రధాన కారణం కాగా, ముఖ్యంగా స్త్రీలు మరియు కౌమారదశలో ఉన్న బాలికలలో, ఎదుగుదల మందగించడం, క్రమరహిత రుతుచక్రం, అలసట మరియు శక్తి కోల్పోవడం వంటి ఇతర సమస్యలకు ఇది కారణమవుతుంది. ఇంకా, భారతదేశంలో 6-59 నెలల వయస్సు ఉన్న ప్రతి 10 మంది పిల్లలలో 7 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
ప్రోక్టర్ అండ్ గాంబుల్ హెల్త్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మిలింద్ థాట్ మాట్లాడుతూ, 'భారతదేశంలో గత మా 50 ఏండ్ల ఉనికిలో ఇనుప ధాతువు లోపంపై అవగాహన మరియు విద్యా ప్రయత్నాలకు పి అండ్ జి హెల్త్ అంకితమైంది. మా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌కు మేము చాలా గర్విస్తున్నాము, వినూత్నమైన ఈ రికార్డులో, 2000 కంటే ఎక్కువ వ్యక్తులు ఐరన్ లోపం అనీమియా నుంచి భారతదేశానికి విముక్తి కల్పించడంలో సహకరించేందుకు ముందుకు వచ్చారు. ఇలా చేయడం ద్వారా ఐరన్ డెఫిషియన్సీ అనీమియాపై అవగాహన పెంచడం, ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ప్రజలకు సహాయం చేయడం మరియు వాటిని అధిగమించడానికి చర్యలు తీసుకోవడమే మా ప్రధాన లక్ష్యం` అని పేర్కొన్నారు.