Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇనార్బిట్ మాల్ హైదరాబాద్ ఇప్పుడు రెండో ఎడిషన్ ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2022 నిర్వహణ కోసం సిద్ధమైంది. పూమా సంస్థ సహకారంతో ఈ రన్‌ను 23 జనవరి 2022 వ తేదీన నిర్వహించబోతుంది. ఈ రన్ కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పుడు తెరుచుకున్నాయి. డిసెంబర్ 31,2021 వ తేదీ లోపుగా నమోదు చేసుకునే వారికి 25శాతం ఎర్లీ బర్డ్ ఆఫర్‌ను సైతం అందించనున్నారు.
ఈ మారథాన్ ఇనార్బిట్ మాల్‌వద్ద ప్రారంభమై, హైదరాబాద్‌లో అత్యంత అందమైన ల్యాండ్‌మార్క్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందిన దుర్గంచెరువు వంతెన మీదుగా సాగుతుంది. ఈ రన్లో పాల్గొనేందుకు ముందుగా అంటే డిసెంబర్ 31,2021 లోపుగా నమోదు చేసుకున్న రన్నర్లకు 25శాతం రాయితీ అందిస్తారు. తద్వరా 5కె రన్ కోసం 599 రూపాయలు, 10కిలోమీటర్ల పరుగుకు 999 రూపాయలు, 21 కిలోమీటర్ల రన్‌కు 1199 రూపాయలు (పన్నులు మినహాయించి)చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాదు, తమ బిబ్స్‌పై పేర్లను సైతం తాము కోరుకున్నట్టుగా పొందవచ్చు. పూమా, ఐడీసీఆర్ మద్దతునందిస్తున్న ఈ రన్లో నమోదుచేసుకున్న వారందరూ 1000 రూపాయల ఖచ్చితమైన బహుమతితో పాటుగా పూమా నుంచి 1799 రూపాయల విలువ కలిగిన టీ షర్ట్‌ను సైతం పొందవచ్చు.
పూమా ఇండియా అండ్ సౌత్ఈస్ట్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగూలీ మాట్లాడుతూ.. 'ఈ రన్ కోసం ఇనార్బిట్ తో చేతులు కలపడం పట్ల ఆనందంగా ఉన్నాము. ఈ రన్‌ను బరోడా, ముంబై లాంటి నగరాలకు సైతం విస్తరిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించేలా ఇలాంటి రన్లో తోడ్పడతాయి. కొన్ని నెలలుగా ఇండ్లకే పరిమితమైన వారికి ఫిట్నెస్ కార్యక్రమాల కోసం బయటకు వచ్చే అవకాశం ఇది అందిస్తుంది` అని అన్నారు.
ఈ మారథాన్‌ను ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ యూ టూ కెన్ రన్ నిర్వహిస్తుంది. సేవా రంగంలో దివ్యాంగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటుగా నైపుణ్యాభివృద్ధి అందించే దిశగా ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఎన్జీఓ నిర్మాణ్ దీనికి చారిటీ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. డి
రిజిస్టర్ చేసుకునేందుకు ఈ వెబ్ సైట్ ను సందర్శించండి:
https://inorbitrun.inorbit.in/durgam-cheruvu-run/