Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎక్సాన్ మొబిల్ లూబ్రికెంట్స్‌కు చెందిన ఎక్సాన్ మొబిల్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో కొత్తగా నాలుగు మొబిల్ కార్ కేర్ ఎలైట్లను ఏర్పాటు చేసింది. సోమవారం వీటిని మొబిల్ బ్రాండ్ అంబాసీడర్ బజరంగ్ పునియా లాంచనంగా ప్రారంభించారు. ఫ్లాగ్షిప్ ఛానెల్‌లు, స్వతంత్ర వర్క్‌షాప్ యజమానులతో కలిసి వీటిని ఏర్పాఉట చేసింది. వాహన యజమానులకు ప్రీమియం కార్ సర్వీసింగ్ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా వీటిని అందుబాటులోకి తెచ్చామని ఎక్సాన్ మొబిల్ లూబ్రికెంట్స్ మార్కెట్ డెవలప్మెంట్ డైరెక్టర్ రూపెందర్ పెంటల్ తెలిపారు. తొలుత బెంగళూరు, ఢిల్లీలో ఏర్పాటు చేసిన వీటిని మరిన్ని నగరాలకు విస్తరించనున్నామన్నారు.