Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లోనూ నష్టాలు చవి చూశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సోమవారం సూచీలు నేల చూపులు చూశాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండిస్టీస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంకు కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురైయ్యాయి. ఈ పరిణామాలతో తుదకు బిఎస్ఇ సెన్సెక్స్ 503 పాయింట్లు కోల్పోయి 58,282కు దిగజారింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 143 పాయింట్లు నష్టపోయి 17,368 వద్ద ముగిసింది.