Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుత ఏడాది నవంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) 4.91 శాతానికి చేరిందని కేంద్ర గణంకాల శాఖ సోమవారం వెల్లడించింది. ముఖ్యంగా పళ్లు, కూరగాయల ధరలు పెరిగాయి. ఇంతక్రితం అక్టోబర్లో సిపిఐ 4.48 శాతంగా, గతేడాది నవంబర్లో 6.93 శాతంగా నమోదయ్యింది. గడిచిన మాసంలో పళ్ల ధరలు 1.87 శాతం పెరిగాయి. ఇంతక్రితం నెలలో ఇవి 0.85 శాతం పెరిగాయి. రిటైల్ ఇంధన ధరలు 13.35 శాతానికి పెరిగాయి. గ్రామీణ ప్రాంతాలతో పోల్చిలే పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సిపిఐ 5.54 శాతం ఎగియగా.. గ్రామీణ ప్రాంతాల్లో 4.29 శాతంగా నమోదయ్యింది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి రెండు శాతం అటూ, ఇటుగా ఉంచాలని ఆర్బిఐ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా.. వచ్చే రెండు త్రైమాసికాల్లో మరింత పెరుగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.