Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : లగ్జరీ కార్ల తయారీదారు స్కోడా ఆటో ఇండియా దక్షిణాధిపై దృష్టి సారించినట్లు తెలిపింది. తన మార్కెట్ ఉనికిని క్రమంగా విస్తరించుకోవడంలో భాగంగా చెక్ ఆటో బ్రాండ్ గతేడాది దక్షిణాదిలో తన కస్టమర్ టచ్పాయింట్లను 84 శాతం పెంచినట్లు తెలిపింది. 2020లో ఇక్కడ డీలర్ నెట్వర్క్ 38 టచ్పాయింట్లుగా ఉండగా.. 2021లో 70 టచ్పాయింట్లకు చేర్చినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలోని 19 నగరాల నుండి 38కి రెట్టింపు చేసినట్లు తెలిపింది. రాబోయే నెలల్లో తిరుపతి, కరీంనగర్, గుల్బర్గా, బళ్లారి, అనంతపూర్లోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొంది.