Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిండిలో సహజసిద్ధమైన కమ్మదనం చెదరని విధంగా నిలిపే సహజసిద్ధమైన రాతితో తయారీ
- 90 నిముషాల కాలపరిమితి నిర్దేశించుకునేలా డిజిటల్ టైమర్ ఏర్పాటు
హైదరాబాద్ : ప్రతీ ఒక్క ఇంట్లో తప్పనిసరిగా చేరవలసిన సాధనం వెట్ గ్రైండర్. చక్కని కరకరలాడే దోశలు, మృదువైన ఇడ్లీలు లేదా మెత్తని వడలు ఏవి కావాలన్నా వాటికి అవసరమైన చక్కని పిండి తయారుచేయగల విధంగా టీటీకే ప్రెస్టిజ్ వారు వెట్ గ్రైండర్ డిజైన్ చేశారు. ఇండ్లలో గ్రైండిగ్ ఇబ్బందులు తొలగించి ఎలాంటి శ్రమ లేకుండా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకునేందుకు టిటికె ప్రెస్టిజ్ కంపెనీ తమ వెట్ గ్రైండర్ల రేంజికి టైమర్ అమర్చిన అన్వేషణాత్మకమైన పిడబ్ల్యుజి 09 వెట్ గ్రైండర్ ని జోడించింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు.
మీరు అద్భుతమైన పనితీరు, కాంపాక్ట్ డిజైన్ తో కూడిన వెట్ గ్రైండర్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే ఇది సరిగ్గా సరిపోతుంది పిడబ్ల్యుజి 09 వెట్ గ్రైండర్. దీనిలో అత్యంత ఇన్నోవేటివ్ ఫీచర్ 90 నిముషాల వరకు టైమ్ సెట్ చేసుకునేందుకు ఉపయోగపడే డిజిటల్ టైమర్. అంటే ఇంట్లో వంట వండే వారు ఇక ఏ మాత్రం గ్రైండింగ్ ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షించుకోవాల్సిన అవసరం లేదు. టైమర్ లో పెట్టిన కాలపరిమితి పూర్తవగానే గ్రైండర్ దానికదే ఆగిపోతుంది.
ఎక్కడకి కావాలంటే అక్కడకి తేలిగ్గా తీసుకుపోగల, తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించే కాంపాక్ట్ టేబుల్ టాప్ డిజైన్ గల వెట్ గ్రైండర్ పిడబ్ల్యుజి 09. దీని వల్ల వెట్ గ్రైండర్ ఎక్కడైనా తేలిగ్గా ఉపయోగించుకోవచ్చు. దీనికి అత్యున్నత నాణ్యతతో కూడిన సహజసిద్ధమైన గ్రైండింగ్ స్టోన్స్ అమర్చారు. ఇవి పిండిని చక్కగా రుబ్బి పెడతాయి. ప్రకృతి సిద్ధమైన రాళ్ల వల్ల పిండిలో సహజసిద్ధమైన కమ్మదనం రుబ్బురోళ్ల తరహాలోనే చెక్కు చెదరకుండా ఉంటుంది. దీనికి అమర్చిన స్టెయిన్ లెస్ స్టీల్ దీర్ఘకాల మనుగడ కలిగి తేలిగ్గా శుభ్రం చేసుకునేలా ఉంటుంది. దీనికి గల 200 డబ్ల్యు మోటార్ మీ గ్రైండింగ్ అవసరాలన్నింటికీ చక్కగా సరిపోతుంది. అడ్వాన్స్ డ్ లిడ్ లాకింగ్ వ్యవస్థ వల్ల మూత తేలిగ్గా అటాచ్ చేసుకోవచ్చు/ తొలగించవచ్చు. మూత పారదర్శకంగా ఉండడం వల్ల పిండి ఎలా నలుగుతోంది తేలిగ్గా చూడవచ్చు, ఇంకా ఎంత నలగాలన్నది తెలుసుకోవచ్చు. గ్రైండింగ్ ప్రక్రియలో పిండి వేడెక్కదు గనుక పిండిలోని రుచి విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఉండదు. రెండు మోడల్స్ కూడా ఉత్పత్తిపై రెండేండ్ల వ్యారెంటీ, మోటర్ పై ఐదు సంవత్సరాల వారెంటీ కలిగి ఉంటాయి.
గత 66 ఏండ్లుగా టీటీకే ప్రెస్టిజ్ హోమ్ కుక్ ల మదిలో స్థానం సంపాదించుకుంది. ప్రతీ ఒక్క భారతీయ కిచెన్ లో కనీసం ఒక్క టీటీకే ప్రెస్టిజ్ ఉత్పత్తి ఉంటుందని అంచనా. విశ్వాసం, భద్రతా, ఆరోగ్యం,పునాదిగా ఈ బ్రాండ్ మనుగడ సాగిస్తోంది. పిడబ్ల్యుజి 09 ఆవిష్కరణతో టీటీకే ప్రెస్టిజ్ వంట పనివారికి సాధికారం చేస్తోంది.
పిడబ్ల్యుజి 09 రిటైల్ ధర రూ.7,595 కాగా ప్రెస్టిజ్ ఎక్స క్లూజివ్ స్టోర్లు, దేశంలోని లీడింగ్ డీలర్ల వద్ద ఇది అందుబాటులో ఉంటుంది.