Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నోయిడా : మైసీట్ 2021- 8వ, 9వ మరియు 10వ తరగతి విద్యార్ధులకు స్కాలర్షిప్ అర్హత మరియు అడ్మిషన్ టెస్ట్ ను మై క్లాస్ రూమ్ తాజాగా ప్రారంభించింది. ఇది యువ విద్యార్ధులకు ఐఐటీ, ఏఐఐఎంఎస్, భారతదేశంలోని టాప్ 100 ఇంజినీరింగ్ మరియు మెడికల్ కాలేజీల్లో గ్యారెంటీగా సీటు పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. మైక్లాస్రూమ్ భారతదేశంలోని టాప్ ఫ్యాకల్టీ, నాణ్యత విద్య మరియు కఠినమైన విద్యా ప్రమాణాలను ప్రతి విద్యార్ధికి వారి నగరంలోనే అత్యాధునిక టెక్నాలజీ మరియు డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ద్వారా అందిస్తుంది.
ఈ ప్రోత్సాహక కార్యక్రమం గురించి మైక్లాస్రూమ్ కో ఫౌండర్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ శర్మ మాట్లాడుతూ.. 'మై సీట్ 2021 అనేది గొప్ప ఆవిష్కర్త, ఇంజినీర్, సైంటిస్ట్, డాక్టర్ లేదా సర్జన్ కావాలని కోరుకునే విద్యార్ధులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఈ పరీక్షలో పాల్గొనడం ద్వారా, ఒలింపియాడ్స్, KVPY, JEE మరియు NEET వంటి రాబోయే పోటీ పరీక్షలకు విద్యార్థులు తమ సంసిద్ధతను అంచనా వేయడానికి, మా నిపుణులైన ఉపాధ్యాయుల నుండి వ్యక్తిగతీకరించిన కెరీర్ కౌన్సిలింగ్ పొందడానికి మరియు స్కాలర్షిప్లు మరియు ఉత్తేజకరమైన రివార్డులను గెలుచుకునే అవకాశాన్ని కూడా పొందుతారు
స్కాలర్షిప్ పరీక్షలు ప్రతి క్లాస్ కోసం రెండు దశల్లో జరుగుతాయి,. 1వ దశకు, అభ్యర్థులు 15 నుంచి 25 డిసెంబర్ 2021 వరకు ఆన్లైన్లో లేదా 16 నగరాల్లోని మా స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల్లో 19వ తేదీ మరియు 25 డిసెంబర్ 2021నాడు ఆఫ్‌లైన్‌లో పరీక్షకు హాజరు కావొచ్చు. 2వ దశలో ప్రతి క్లాస్ నుంచి టాప్ 100 ర్యాంకర్ల కొరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి. తుది ఫలితాలు జనవరి 5, 2022 నాడు ప్రకటిస్తారు. విద్యార్ధులు స్వయంగా https://myseat.myclassroom.digital/ పై రిజిస్టర్ చేసుకోవచ్చు.
మైక్లాస్రూమ్లో అకడమిక్ డైరెక్టర్, ప్రమోద్ కుమార్ రాణా, JEE, IIT-JEE టాపర్లకు మెంటారింగ్ మరియ కోచింగ్‌లో 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన మాట్లాడుతూ.. 'విలక్షణమైన ఫలితాలు లభ్యంగా అత్యంత నాణ్యమైన విద్యను అందించడంపై మైక్లాస్రూమ్ ప్రోగ్రామ్‌లు అన్నీ దృష్టి సారిస్తాయి. మా క్రమశిక్షణ కలిగిన, ఫోకస్డ్, మరియు గైడెడ్ ప్రోగ్రామ్‌లు విద్యార్ధుల పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు రూపొందించారు` అని పేర్కొన్నారు.
మైక్లాస్రూమ్లో అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ గగన్ ఓహ్రా, NEET 22 సంవత్సరాల అనుభవంతో ఆయన, మాట్లాడుతూ.. 'ఔత్సాహిక విద్యార్ధుల కొరకు ఆరోగ్యవంతమైన పోటీ వాతావరణంలో అత్యుత్తమ విద్యా మరియు మానిసక మద్దతు అందించడానికి టీచర్లు, తోటి విద్యార్ధులు మరియు తల్లిదండ్రులతో కూడిన ఒక సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని మైక్లాస్రూమ్ విశ్వసిస్తుంది` అని పేర్కొన్నారు. డాక్టర్, ఓహ్రా తన కెరీర్లో AIIMS మరియు NEETల్లో AIR అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మెంటార్‌గా వ్యవహరించారు.